పిఎంఇండియా
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జాస్మిన్ లాంబోరియాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
బాక్సింగ్ క్రీడపై అంకితభావం, ప్రతిభా ప్రదర్శనలో స్థిరత్వం ఆమె సాధించిన ఈ విజయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:
“గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో స్వర్ణపతక విజేత జాస్మిన్ లాంబోరియాకు అభినందనలు. ఈ విజయంలో ఆమె అంకితభావం, స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
Congrats to Jasmine Lamboria for winning the Gold in the 57 kg Women’s Boxing event at the Glasgow Commonwealth Games. Her commitment and consistency are clearly reflected in her success. My best wishes to her.#CWG2026
— Narendra Modi (@narendramodi) August 1, 2026