Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కార్మిక సంఘాల గుర్తింపు నకు సంబంధించి నియమాల రూపకల్పన కై కార్మిక సంఘాల చట్టం, 1926 లో సవరణ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


 

కార్మిక సంఘాల గుర్తింపు నకు సంబంధించి నియమాల రూపకల్పన కై కార్మిక సంఘాల చట్టం, 1926 లో సవరణ లు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలిపింది.

ప్రయోజనాలు:

ఈ ఆమోదం తో-

కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి లలో కార్మిక సంఘాల గుర్తింపు నకు మార్గం సుగమం కాగలదు;
త్రైపాక్షిక సంఘాల లో శ్రామికుల కు వాస్తవ ప్రాతినిధ్యానికి బాట పడగలదు;
శ్రామిక ప్రతినిధులను ప్రభుత్వం తనకు తానుగా నామనిర్దేశం చేయడానికి అడ్డుపెట్టడం సాధ్యపడగలదు; ఇంకా,
వ్యాజ్యాలను మరియు పారిశ్రామిక అశాంతి ని కూడా తగ్గేందుకు ఆస్కారం ఉండగలదు.

శ్రామికుల ప్రతినిధులను త్రైపాక్షిక సంఘాల కు ప్రభుత్వం నామినేట్ చేసే ప్రక్రియ మరింత పారదర్శకం గా ప్రతిపాదిత బిల్లు మార్చివేయగలుగుతుంది.  ఆ విధం గా గుర్తింపు ను పొందిన ట్రేడ్ యూనియన్ లు పారిశ్రామిక సామరస్యాన్ని పరిరక్షించడం లో జవాబుదారుగా ఉండగలవు.  కేంద్ర/ రాష్ట్ర స్థాయి లలో కార్మిక సంఘాల గుర్తింపు వివిధ విభాగాలు ఆ తరహా అభ్యాసాన్ని మోసగించేందుకు వాడుకోవడాన్ని నిరోధించగలుగుతుంది.  గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘాలకు కేంద్ర స్థాయిలోనో, రాష్ట్ర స్థాయి లోనో నిర్దిష్ట భూమిక లను కేటాయించే ఆస్కారం కూడా ఉంటుంది.