Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం, 1992 లో సవరణకు మంత్రిమండలి ఆమోదం


కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టం (సి ఎ యు), ఇంఫాల్ అధికార పరిధిలోకి నాగా లాండ్ రాష్ట్రాన్ని చేర్చేందుకు కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం, 1992 లోని సంబంధిత ఉపనిబంధనలలో సవరణ చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టం (సి ఎ యు), ఇంఫాల్ అధికార పరిధిలోకి నాగా లాండ్ రాష్ట్రాన్ని చేర్చిన తరువాత పశు పోషణ రంగంలో వృత్తి నిపుణులను నాగా లాండ్ లోని పశువైద్య శాస్త్ర కళాశాల అందించగలుగుతుంది. దీనితో ఆ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక వృద్ధి సాధనకు మార్గం సుగమం కాగలదు. వ్యవసాయదారులకు కొత్త మెలకువలను పరిచయం చేయడంలో నూతన కళాశాల తోడ్పడగలదు. ఫలితంగా నాగా లాండ్ రాష్ట్రంలో దేశీయ పశువుల ఉత్పత్తి, ఉత్పాదకత వర్ధిల్లేందుకు ఊతం లభించగలదు.

సి ఎ యు, మణిపూర్ పొందుతున్నటువంటి ప్రయోజనాలను నాగా లాండ్ రాష్ట్రం తాను కూడా పొందడంలో ఈ సవరణ సహాయకారి కాగలదు. యావత్తు ఈశాన్య ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకొని సి ఎ యు, మణిపూర్ ను నెలకొల్పడమైంది.

***