పిఎంఇండియా
కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలు మరియు అస్సామ్ రైఫిల్స్ కు చెందిన వైద్యాధికారుల పదవీ విరమణ వయస్సు పెంపునకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దిగువన పేర్కొన్న వారి విషయంలో పదవీ విరమణ వయస్సు పెంపునకు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
1. కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలు మరియు అస్సామ్ రైఫిల్స్ కు చెందిన జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ విషయంలో 60 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచడం;
2. దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలు మరియు అస్సామ్ రైఫిల్స్ కు చెందిన స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీఫసర్స్ విషయంలో 60 ఏళ్ళ నుండి 65 ఏళ్ళకు పెంచడం.
ఇది స్పెషలిస్ట్ మరియు జనరల్ డ్యూటీ మెడికల్ కాడర్ కు చెందిన అధికారుల సేవల వినియోగానికి దోహదం చేయగలుగుతుంది. తద్వారా రోగులకు ఉత్తమ సంరక్షణ, వైద్య కళాశాలల్లో సముచితమైన రీతిలో విద్యా సంబంధ కార్యకలాపాలతో పాటు, ఆరోగ్య సంరక్షణ సేవల అందజేతకు ఉద్దేశించిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంలో కూడా ఇది తోడ్పడగలదు.