Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లాకు ప్రధానమంత్రి అభినందనలు


కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

కొలంబియాతో ఉన్న స్నేహబంధానికి భారత్ ఎంతో విలువనిస్తుందనిఈ బంధం అన్ని రంగాల్లోనూ నిరంతరం బలపడుతూనే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “విజయవంతమైన పదవీకాలాన్ని పూర్తి చేయాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారాబోయే ఏళ్లలో మన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయటానికి ఆసక్తిగా ఉన్నాను” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లాకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

కొలంబియాతో ఉన్న స్నేహ బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందిఈ బంధం అన్ని రంగాల్లోనూ నిరంతరం బలపడుతోందిమీ పదవీకాలం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారాబోయే ఏళ్లలో మన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా.

@ABDELAESPRIELLA