Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గాజాలో శాంతి స్థాపన దిశగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి


గాజాలో శాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారుబందీల విడుదలకు వస్తున్న సంకేతాలు.. మానవతావాదదౌత్యపరమైన ప్రయత్నాల్లో కీలక ముందడుగని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

గాజాలో శాశ్వతంగా శాంతి నెలకొనేలా జరిగే అన్ని ప్రయత్నాలకు మద్దతిచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

ఎక్స్ పోస్టులో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

గాజాలో శాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కీలక పురోగతిని సాధిస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని మేం స్వాగతిస్తున్నాంబందీల విడుదలకు వస్తున్న సంకేతాలు కీలక ముందడుగుకు సూచన.

శాశ్వతమైనన్యాయబద్ధమైన శాంతి సాధన దిశగా జరిగే ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుంది.

@realDonaldTrump 

@POTUS”