Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సంతాపం


గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన దుర్ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన శ్రీ మోదీ… గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం అత్యంత విచారకరం. ఈ విషాదంలో తమకు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.

***