పిఎంఇండియా
వడోదరలో సర్దార్‌ధామ్ వసతిగృహ ప్రారంభ కార్యక్రమ ప్రసంగ ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. దేశ ప్రగతి సాధనలో ప్రభుత్వం, సమాజం, 140 కోట్ల మంది పౌరుల సామూహిక ప్రయత్నాలకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రధాని వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి వరుస సందేశాల్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘వడోదరాలో సర్దార్‌ధామ్ వసతి గృహాన్ని ప్రారంభించడం అత్యంత సంతోషదాయకమే కాక, గర్వకారణంగా కూడా అనిపించింది.’’
‘‘పెను మార్పుతో పాటు, మెరుగైన ఫలితాల్ని సాధించడానికి సమాజం, ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ విద్యావిధానం దీనికొక పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది.’’
‘‘మన బిడ్డలను దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాల్లో అవకాశాల సరికొత్త తలుపులు తెరుచుకోవాలి. ఇది ప్రభుత్వ బాధ్యత, అలాగే సమాజ బాధ్యత కూడా. ఈ బాధ్యతను సర్దార్‌ధామ్ పూర్తి నిష్ఠతో నిర్వర్తిస్తుండడం నాకు సంతోషం కలిగిస్తోంది.’’
‘‘గుజరాత్ సహా యావద్దేశం గ్లోబల్ సప్లయ్ చైన్లో ఓ ప్రధాన కేంద్రంగా మారాలి. ఈ దిశగా మేం అవిరళ కృషి చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ దిశగా వడోదరా పోషించే పాత్ర కూడా కీలకంగా మారనుంది.’’
‘‘140 కోట్ల మంది ఒక్క అడుగును ముందుకు వేశారంటే, అప్పుడు దేశంలో 140 కోట్ల అడుగులు ముందుకు పడినట్లే. ఈ కారణంగా ప్రపంచంలో ప్రస్తుత సంక్షోభ కాలంలో దేశ ప్రజలకు నేను కొన్ని ప్రత్యేక విన్నపాలు చేస్తున్నాను..’’
***
वडोदरा में सरदारधाम छात्रावास का उद्घाटन कर अत्यंत संतोष और गर्व की अनुभूति हुई है। pic.twitter.com/bdG5XyHGG7
— Narendra Modi (@narendramodi) May 11, 2026
बड़े बदलाव और बेहतर परिणाम के लिए समाज और सरकार का साथ मिलकर काम करना बहुत जरूरी है। राष्ट्रीय शिक्षा नीति इसका एक बड़ा उदाहरण है। pic.twitter.com/O7J6sbPXaU
— Narendra Modi (@narendramodi) May 11, 2026
हमारे बेटे-बेटियों के लिए सभी क्षेत्रों में संभावनाओं के नए-नए द्वार खुलें, ये सरकार के साथ-साथ समाज की भी जिम्मेदारी है। मुझे खुशी है कि सरदारधाम इस दायित्व को पूरी निष्ठा से निभा रहा है। pic.twitter.com/NXG2R0FTqG
— Narendra Modi (@narendramodi) May 11, 2026
गुजरात के साथ ही पूरा देश ग्लोबल सप्लाई चेन का बड़ा केंद्र बने, इस दिशा में हम लगातार काम कर रहे हैं। आने वाले समय में वडोदरा की भी इसमें महत्वपूर्ण भूमिका होने वाली है। pic.twitter.com/jPgSfsWkHH
— Narendra Modi (@narendramodi) May 11, 2026
140 करोड़ लोग एक कदम आगे बढ़ते हैं, तो देश भी 140 करोड़ कदम आगे बढ़ता है। इसलिए वैश्विक संकट के मौजूदा दौर में देशवासियों से मेरे कुछ विशेष आग्रह… pic.twitter.com/uO5xFHSEUL
— Narendra Modi (@narendramodi) May 11, 2026