Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లో గల గుజ‌రాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ స్నాత‌కోత్స‌వం లో ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం

గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లో గల గుజ‌రాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ స్నాత‌కోత్స‌వం లో ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం

గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లో గల గుజ‌రాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ స్నాత‌కోత్స‌వం లో ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం

గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లో గల గుజ‌రాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ స్నాత‌కోత్స‌వం లో ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం


గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ శ్రీమాన్ ఓపీ కోహ్లీ గారు, ముఖ్య‌మంత్రి శ్రీ రూపాణీ గారు, ఉప ముఖ్య‌మంత్రి శ్రీ నితిన్ భాయీ, మంత్రివర్గం లో వారి సహచరులైన శ్రీ మాన్ భూపేంద్ర జీ చుడాసమా, శ్రీ ప్ర‌దీప్ సింగ్ జ‌డేజా, గుజ‌రాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ జె.ఎం. వ్యాస్‌, ఈ స్నాతకోత్సవం లో పాల్గొంటున్న అందరు ఆహ్వానితులు, పతకాలను గెలుచుకొన్న వారు మరియు వారి సంర‌క్ష‌కులు, నేటి కార్యక్రమానికి ప్రధాన మంత్రి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన పాఠ‌శాల విద్యార్థులు.. 

సోద‌రులు మరియు సోదరీమణులారా, 

మీకంద‌రికీ గుజ‌రాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నాలుగో స్నాత‌కోత్స‌వానికి స్వాగ‌తం.  ఈ కార్య‌క్ర‌మానికి నేను అతిథినని ఎవ‌రూ పొర‌పడకుండా ఉండడానికే నేను మీకు ఇలాగ స్వాగ‌తం ప‌లుతుకున్నాను .  ముందుగా, ఈ రోజున ప‌ట్టాల‌ను స్వీక‌రించనున్న విద్యార్థులు అంద‌రితో పాటు ఎవరైతే వారి జీవనంలో ఒక అత్యంత ముఖ్యమైన యాత్ర ను మొదలుపెట్టబోతున్నారో వారికి నేను ఆప్యాయంగా అభినందనలు అందజేయదలచుకొన్నాను.  అలాగే ఇక్క‌డ చ‌దువుకున్న విద్యార్థులంద‌రి త‌ల్లితండ్రుల‌కు, వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడాను నా హృద‌యపూర్వ‌క శుభాకాంక్షలను అందజేస్తున్నాను.  వారి పెంప‌కం తీరు ఫలితంగా, వారి కృషి కార‌ణంగా, వారి కఠోర శ్రమ పర్యవసానంగా ఈ రోజున వారి ప్రియ‌తమ సంతానం ఇంత‌టి విజ‌యాన్ని సాధించారు. 

గుజ‌రాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ కి వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.  ఈ విశ్వ‌విద్యాలయం, ఇక్క‌డ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మార్గ‌ద‌ర్శ‌కులు.  ఇది బయట ఎక్కువ‌గా ప్ర‌చారంలో ఉన్న కోర్సుల‌ను అందించే విశ్వ‌విద్యాల‌యం కాదు.  ఇక్క‌డ దృష్టి పెట్టే అంశం చాలా నిర్దిష్టంగా ఉంటుంది.  గాంధీన‌గ‌ర్ లోని ఈ విశ్వ‌విద్యాల‌యంలో చేర‌డమ‌నేది మీకు అంత సులువైన విష‌యం కాదు.  మీరు ఇక్క‌డ చేరాల‌ని భావించినప్పుడు మిమ్మ‌ల్ని చాలా మంది.. నిజంగానే ఈ కోర్సు చ‌ద‌వాల‌ని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించి వుంటారు.  నేరాల‌కు సంబందించిన టీవీ కార్య‌క్ర‌మాల‌ను ఎక్కువగా చూస్తున్నావా?  లేదా అగాధా క్రిష్టీ ర‌చించిన న‌వ‌ల‌లను గానీ, ఫెలూదా పుస్త‌కాల‌ను గానీ ఎక్కువ‌గా చ‌దువుతున్నావా? అని ప్ర‌శ్నించి వుంటారు.  అలా నిరుత్సాహ‌ప‌రచిన‌ప్ప‌టికీ మీరు ఈ కోర్సు లో చేరారు.  సంప్ర‌దాయ‌బ‌ద్దంగా చూసిన‌ప్పుడు దీన్ని సంప్ర‌దాయేత‌ర కోర్సు గా భావిస్తారు.  కానీ ఈ కాలానికి ఇది చాలా ముఖ్య‌మైన కోర్సు.  అంద‌రినీ కాద‌ని ఈ కోర్సు లో చేరారంటే మీరు మీ మ‌న‌సును న‌మ్మారని అర్థం.  అంతే కాదు క‌ల‌లను పండించుకోవాల‌నే కృతనిశ్చ‌యం తో మీకంటూ నిర్ణ‌యాత్మ‌క శ‌క్తి ని సంపాదించుకున్నారు.  ఈ సుగుణం మీకు మీ భ‌విష్య‌త్తు లో కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.  మిత్రులారా, జిఎఫ్ఎస్ యు చాలా త‌క్కువ‌ కాలం లోనే విద్య రంగం లో ఉత్త‌మ‌ ఫ‌లితాల‌ను సాధిస్తూ ఓ ప్ర‌త్యేక‌త‌ ను సంతరించుకొంది.  ఈ విద్యాలయానికి నేశన‌ల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేశన్ కౌన్సిల్ వారు ‘ఎ’ గ్రేడ్ ను ఇవ్వ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం.  ప్రారంభించిన త‌రువాత అనతి కాలం లో ఈ ఘ‌న‌త‌ ను సాధించిన చాలా త‌క్కువ విశ్వ‌విద్యాల‌యాల్లో జిఎఫ్‌ ఎస్ యు ఒక‌టి.  35 కోర్సుల‌తో, 2200కు పైగా విద్యార్థుల‌తో క‌ళ‌క‌ళలాడుతున్న ఈ విశ్వ‌విద్యాల‌యం ఫోరెన్సిక్ శాస్త్ర‌ రంగం లో బోధ‌న‌ తో పాటు, ప‌రిశోధ‌న‌లు కూడా నిర్వ‌హిస్తోంది.  ఈ విశ్వ‌విద్యాల‌యాన్ని గుజరాత్ కు, దేశానికి గ‌ర్వ‌కారణంగా తీర్చిదిద్దినందుకు ఇక్క‌డి నాయ‌క‌త్వాన్ని, యాజ‌మాన్యాన్ని, జిఎఫ్ ఎస్ యు అధ్యాప‌క‌ుల‌ను అభినందిస్తున్నాను.  ఎంతో శ‌క్తి తో, నిబ‌ద్ద‌త‌ తో మీరు ఈ విద్యాల‌యాన్ని తీర్చిదిద్దుతున్నారు. 

మిత్రులారా, 
నేరాలు జ‌రిగిన‌ప్పుడు వాటిని విచారించి బాధితుల‌కు త‌గిన న్యాయాన్ని చేసే వ్య‌వ‌స్థ‌ లో పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్‌, న్యాయ‌ వ్య‌వ‌స్థ అంత‌ర్గ‌త భాగాలుగా ప‌ని చేస్తాయి.  ఏ దేశంలోనైనా ఈ మూడు విభాగాలు ఎంత బ‌లోపేతంగా ఉంటే ఆ దేశ పౌరులకు అంత బాగా భ‌ద్ర‌త ల‌భిస్తుంది.  ఆ దేశం లోని నేర కార్య‌క్ర‌మాలకు ముకుతాడు ప‌డుతుంది.  దీనిని దృష్టి లో పెట్టుకొని ఈ మూడు విభాగాల‌ను త‌గిన విధంగా బ‌లోపేతం చేయ‌డానికిగాను గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా గుజ‌రాత్ లో స‌మగ్ర‌మైనటువంటి కృషి జ‌రుగుతోంది.  ఇది ఎంతో అంకిత‌ భావం తో కొన‌సాగుతోంది.  డిఫెన్స్ పవర్ యూనివర్సిటీ, నేశనల్ లా యూనివర్సిటీ, ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ.. ఈ మూడు న్యాయ వ్య‌వ‌స్థ‌ తో సంబంధ‌ం కలిగివున్నటువంటి స‌మ‌గ్ర‌మైన అంశాలు.  దీని ఫ‌లితంగా డిఫెన్స్ పవర్ యూనివర్సిటీ లో విద్య‌ ను అభ్య‌సించి ఉత్తీర్ణ‌త సాధించే విద్యార్థులు సాయుధ బ‌ల‌గాల్లో చేరి దేశ అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌ ను బ‌లోపేతం చేస్తారు. నేశనల్ లా యూనివర్సిటీ, ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ల నుండి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు వారి సామ‌ర్థ్యం తో మ‌న సాయుధ బ‌ల‌గాల‌కు సంబంధించి న్యాయ విధానాల లోను, పరిశోధ‌న‌ల లోను ఉప‌యోగ‌ప‌డుతారు.  సాయుధ బ‌ల‌గాల సామ‌ర్థ్యాన్ని ఇనుమ‌డింప జేస్తారు.
 
మిత్రులారా, 

ఈ రోజుల్లో నేర‌గాళ్లు వారి నేరాలు బయట‌ప‌డ‌కుండా అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  ప‌ట్టుబ‌డ‌కుండా ఉండ‌డానికి ఎంత చేయాలో అంతా చేస్తున్నారు.  ఇటువంటి ప‌రిస్థితులలో వారికి ఒక విష‌యాన్ని తెలియ‌జేయాలి.  ఈ రోజున వారు ఏదైనా త‌ప్పు చేస్తే భ‌విష్య‌త్తు లో వారు త‌ప్ప‌కుండా ప‌ట్టుబ‌డ‌తార‌ని, ఏదో ఒక‌ రోజున ఫ‌లితాల‌ను అనుభ‌వించాల‌నే సందేశాన్ని ఇవ్వాలి.

ఏదో ఒక రోజు ప‌ట్టుబ‌డ‌తామ‌నే భ‌యం, వారు ఒడిగట్టిన నేరాల‌కు న్యాయస్థానం లో త‌ప్ప‌కుండా శిక్ష ప‌డుతుంద‌నే భ‌యం ఉంటే నేరాలు త‌గ్గుముఖం ప‌డుతాయి.  ఇక్క‌డే ఫోరెన్సిక్ సైన్స్ ప్రాధాన్య‌ం చాలా ఉంది.  నేరగాళ్ల‌ కు త‌ప్ప‌కుండా శిక్ష‌లు ప‌డితే అది త‌ప్ప‌కుండా న్యాయ వ్య‌వ‌స్థ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కాన్ని పెంచుతుంది. 

నేర ప‌రిశోధ‌న, న్యాయ వ్య‌వ‌స్థ‌ ల‌ను శాస్త్రీయం గా బ‌లోపేతం చేయ‌డానికి గాను భారీ సంఖ్య‌ లో మాన‌వ వ‌న‌రుల‌ను అంద‌జేస్తున్నందుకు జిఎఫ్ ఎస్ యు కు ప్ర‌త్యేకంగా నా అభినంద‌న‌లు.  మీ విశ్వ‌విద్యాల‌యం సేవ‌ల‌ను కేవ‌లం దేశం లో మాత్ర‌మే ఉప‌యోగించుకోవ‌డం లేదు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న ప‌లు న్యాయ సంస్థ‌లు మీ విశ్వ‌విద్యాల‌య సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంటున్నాయి.  ఇత‌ర దేశాల సిబ్బందికి శిక్ష‌ణ‌, క‌న్స‌ల్టెన్సీ సేవ‌ల‌ను అందిస్తూ ఈ యూనివర్సిటీ అంత‌ర్జాతీయ స్థాయి లో కీర్తి ప్ర‌తిష్ట‌ ల‌ను సంపాదించుకుంటోంది.
 
గ‌త ఆరు సంవ‌త్స‌రాల్లో ఆరు వేల మంది అధికారుల‌కు గుజ‌రాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ శిక్ష‌ణ ను అందించింద‌నే విష‌యాన్ని నాకు చెప్పారు.  20 దేశాల‌కు చెందిన 700 మందికి పైగా అధికారులు ఇక్క‌డ శిక్ష‌ణ తీసుకొన్నారు.  వారు ఇక్క‌డ తెలుసుకున్న విజ్ఞానం ద్వారా త‌మ త‌మ దేశాల్లో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్నారు.  ఇది మీ అంద‌రికీ ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మైన విష‌యం.  త‌మ రాష్ట్రం లోని విద్యాల‌యం శిక్ష‌ణ‌ ను, విద్య  ను అందించ‌డం ద్వారా అంత‌ర్జాతీయ భ‌ద్ర‌త లో ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తున్నందుకు గుజ‌రాత్ ప్ర‌జ‌లు కూడా ఎంతో గ‌ర్వించాలి.

మిత్రులారా,

ఈ ఆధునిక స‌మాజం లో ప్ర‌తి కొత్త వ్య‌వ‌స్థ కూడా అత్యాధునిక సాంకేతిక‌త‌ ను అవ‌గాహ‌న చేసుకోవ‌డం చాలా చాలా ముఖ్యం.  ఈ విష‌యం లో డిజిట‌ల్ సాంకేతిక విజ్ఞానం చాలా ప్ర‌ధాన‌మైనటువంటి పాత్ర‌ ను పోషిస్తోంది.  డిజిట‌ల్ సాంకేతిక‌ విజ్ఞానం అనేది ఫోరెన్సిక్ సైన్స్ కు నూత‌న శ‌క్తి ని అందిస్తోంది.  గ‌తంలో ప‌రీక్ష‌లను గాని, ప‌రిశోధ‌న‌లను గాని భౌతికం గా నిర్వ‌హించవలసి వ‌చ్చేది.  కానీ ఈ రోజుల్లో ఈ ప‌నుల‌ంన్నింటినీ డిజిటిల్ సాంకేతిక‌ విజ్ఞానం ద్వారా చాలా సులువు గా, చాలా ఖ‌చ్చితం గా చేయ‌గ‌లుగుతున్నాం.  నూత‌న సాప్ట్‌వేర్ ల‌ను త‌యారు చేయ‌డానికి, డిజిట‌ల్ ఉపకరణాల వినియోగాన్ని పెంచ‌డానికి మ‌రింత అవ‌కాశం ఉంద‌ని నేను న‌మ్ముతున్నాను.  ఈ దిశ‌గా మ‌రింత శ్ర‌ద్ధ‌ తో మనం ప‌ని చేయాలి.

మిత్రులారా,

ఒక వైపు ఇంట‌ర్ నెట్ అనేది మ‌న జీవితాల‌ను సుల‌భ‌త‌రం చేస్తోంది.  అంతే కాదు అదే స‌మ‌యం లో అది కొత్త నేరానికి అవ‌కాశం క‌ల్పించింది.  అదే సైబ‌ర్ క్రైమ్‌.  సైబ‌ర్ క్రైమ్ దేశ ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ కు  అనేక స‌వాళ్ల‌ ను విసురుతోంది.  దాని కార‌ణంగా అనేక ప్ర‌ధాన‌మైన సంస్థ‌లు, విభాగాలు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయి.  ఆర్ధిక సంస్థ‌లు, విద్యుత్తు కేంద్రాలు, ఆసుప‌త్రులు సైబ‌ర్ నేరాల‌ బారిన ప‌డుతున్నాయి.  ఇది మ‌న దేశ భ‌ద్ర‌త‌ కే కాదు, ఇత‌ర అనేక దేశాల భ‌ద్ర‌త‌ కు కూడా ముప్పు గా ప‌రిణ‌మించింది.  ఈ రోజున ఈ సంద‌ర్భంగా సైబ‌ర్‌, డిజిట‌ల్ నిపుణుల‌ను నేను అభ్య‌ర్థిస్తున్నాను.. డిజిట‌ల్ ఇండియా మిశన్ లో భాగ‌స్వాములై దేశంలో భ‌ద్ర‌త‌ ను కాపాడాల‌ని.  త‌ద్వారా వారు కూడా సాధికారులు కావాల‌ని కోరుతున్నాను.
 
సైబర్‌ క్రైమ్స్ ను అరిక‌ట్ట‌డానికిగాను, నేరగాళ్లు భ‌య‌ప‌డేలా ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంది.  సైబ‌ర్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ను కూడా బ‌లోపేతం చేయ‌డం జ‌రిగింది.  కానీ ఈ దేశానికి మీ వంటి నిపుణులు చాలా పెద్ద సంఖ్య‌ లో అవ‌స‌రం. సైబ‌ర్ క్రిమినల్స్ ను ప‌ట్టుకోవాలంటే ప‌రిశోధ‌న సంస్థ‌ల‌కు మీ అవ‌స‌రం చాలా ఉంది. 

మిత్రులారా,

ఒక్క నేర‌ నిరూప‌ణ రంగంలోనే కాక ఇత‌ర రంగాల‌లోనూ ఫోరెన్సిక్ సైన్స్‌ కు ప్రాధాన్య‌ం పెరుగుతూ వ‌స్తోంది.  ఉదాహ‌ర‌ణ‌ కు బీమా రంగం లో వివిధ వ‌ర్గాల‌ ప్ర‌జ‌లు వారి క్లెయిముల ప‌రిష్కారానికి ఇన్సూరెన్స్ కంపెనీ ల‌ను ఆశ్ర‌యిస్తుంటారు.  ఇటువంటి సంద‌ర్భాల‌లో బీమా ను క్లెయిము చేసే వ్య‌క్తి నిజ‌మైన వ్య‌క్తా, కాదా అనేది తేల్చ‌డం పెద్ద స‌వాలు.  ఈ విష‌యం లో ఫోరెన్సిక్ సైన్స్ ప‌రిజ్ఞానం వారికి ఉప‌క‌రిస్తుంది.  అలాగే, ఆరోగ్య‌ రంగం లో ప‌నిచేస్తున్న వారికి ఫోరెన్సిక్ సైన్సు కు సంబంధించిన‌ ప‌రిజ్ఞానం ఉన్న‌ట్ట‌యితే, ఫోరెన్సిక్ సైన్స్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని త‌మ వృత్తి ని నిర్వ‌హించ‌గ‌ల‌రు.  ఉదాహ‌ర‌ణ‌ కు ఒక నేరం లో గాయ‌ప‌డిన  వ్య‌క్తి ఆసుపత్రి కి వ‌స్తే ఆయన వెంట ఫోరెన్సిక్ సైన్స్‌ కు సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి.  ఆరోగ్య రంగం లో ప‌నిచేస్తున్న‌ వారికి, న‌ర్సుల‌కు ఫోరెన్సిక్ సైన్స్‌ గురించి మంచి అవ‌గాహ‌న ఉంటే వారు ఈ సాక్ష్యాలను ప‌రిర‌క్షించ‌డానికి ఎంత‌గానో స‌హ‌క‌రించే అవ‌కాశం  ఉంది.

మాన‌వ వేధ‌స్సు కు సంబంధించి చురుకైన అవ‌గాహ‌న ను క‌లిగివుండ‌డం ఫోరెన్సిక్ సైన్స్‌ కు చెందిన ప్ర‌తి విద్యార్థి కి చాలా అవ‌స‌రం.  గుజ‌రాత్‌ లో, రాజ‌స్థాన్‌ లో నివసించే పగీ సముదాయం గురించి మీరు వినే ఉంటారు. క‌చ్ఛ్, ఇంకా స‌రిహ‌ద్దు ప్రాంతాల‌లో నివ‌సిస్తున్న పగీ సముదాయానికి చెందిన వారు శ‌తాబ్దాలుగా మాన‌వ మేధ‌స్సు విష‌యంలో పేరెన్నిక‌ గ‌న్న‌ వారు. ఉదాహ‌ర‌ణ‌కు, ఒంటె పాద‌ ముద్ర‌ ల‌ను చూసి వారు ఆ ఒంటె పై ఎవ‌రైనా ప్ర‌యాణిస్తున్నారా లేక అది సామానును కూడా మోసుకుపోతోందా అనే విష‌యాన్ని చెప్పేసే వారు.  ఇటువంటి నైపుణ్యాన్ని, పగీ సముదాయం వారు చిన్న‌ప్ప‌టి నుండే అల‌వ‌ర‌చుకొనే వార‌ని నేను ఎక్క‌డో చ‌దివాను.  
కొన్ని చోట్ల ఇప్ప‌టికీ కొన్ని దారుణ‌మైన నేరాల‌ను ఛేధించ‌డం లో పోలీసులు ప‌గి సముదాయం యొక్క స‌హాయాన్ని తీసుకుంటుంటారు.  ఇటువంటివి ప్ర‌పంచం లో ఏదో ఒక చోట ఉప‌యోగిస్తున్నార‌ని నేను విశ్వ‌విద్యాల‌యం వారికి, దాని పాల‌న యంత్రాంగానికి తెలియ‌జేస్తున్నాను. 
ఇదంతా మాన‌వ మేధ‌స్సు ఆధారంగా జ‌రుగుతోంది.  ఈ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఈ అంశం పైన దృష్టి సారించాలి.  ఇంత‌కు ముందు, డిజిట‌ల్ సాంకేతిక విజ్ఞానం లేని రోజుల‌లో, ఆ స‌మ‌యం లో ప్ర‌జ‌ల నుండి వివిధ‌ సాక్ష్యాలు సేక‌రించి వారి వేలిముద్ర‌ ల‌తో స‌రిపోల్చే వారు.  చేతి వ్రాత నిపుణులు ఉండే వారు.  మాన‌సిక విశ్లేష‌కులు వ్య‌క్తుల మాన‌సిక స్థితిగ‌తుల‌కు సంబంధించిన ప్రొఫైల్స్ ను రూపొందించే వారు.  గ‌తంలో ఇటువంటివ‌న్నీ ఉండేవి.

ఇటువంటి సంప్ర‌దాయ ప‌ద్ధ‌తులు భార‌త‌దేశం లో  ప్ర‌తి రాష్ట్రం లో ఉండేవి.  ఈ ప‌ద్ధ‌తుల‌న్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ  క్రోడీక‌రించి వాటిని నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో అనుసంధానం చేయాలి.  ఈ తరహా ప‌ద్ధ‌తులను ఇక్క‌డ మాత్ర‌మే కాదు, ప్ర‌పంచం లో ఎక్క‌డ ఉన్నా స‌రే ఆ ప‌రిజ్ఞానాన్ని మ‌నం ఉప‌యోగించుకున్న‌ట్ట‌యితే మ‌నం ఈ రంగాన్ని మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డానికి వీలు ఉంటుంది.  

ఉదాహ‌ర‌ణ‌కు సైకో ప్రొఫైల్‌ను త‌యారు చేయ‌డాన్నే తీసుకోండి.. మాన‌సిక స్థితి విశ్లేష‌ణ‌ ను ఆ వ్య‌క్తితో మాట్లాడ‌డం ద్వారా లేదా కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌శ్నించి స‌మాచారాన్ని రాబ‌ట్ట‌డం ద్వారా సేక‌రించే వారు.

ఇవాళ‌ దీనిని సాంకేతిక ప‌రిజ్ఞానం సాయం తో సేక‌రిస్తున్నారు.  సంప్ర‌దాయ ప‌రిజ్ఞానంతో పాటు సాంకేతిక ప‌రిజ్ఞ‌ానం తోడ్పాటు అనేది  స‌మ‌ర్థ‌త‌ను పెంప‌పొందించ‌డ‌మే కాక క‌చ్చిత‌మైన ఫ‌లితాలను ఇస్తోంది.  అలాగే, ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ వారు సంప్ర‌దాయ విజ్ఞానాన్ని, మాన‌వ‌ మేధ‌స్సును, ఆధునిక సాంకేతిక విజ్ఞానం తో అనుసంధానం చేసి ఈ రంగంలో ఎలా ప‌నిచేయ‌వ‌చ్చోప‌రిశోధించ‌వ‌చ్చు.  మ‌న విశ్వ‌విద్యాల‌యం ఈ దిశ‌ గా ప‌రిశోధ‌న సాగించ‌వ‌చ్చు.

మిత్రులారా,

నేరగాళ్లు, వారు నేరాల‌కు పాల్ప‌డే విధానాలు నిరంత‌రం మారుతున్నాయి. శ‌ర‌వేగంతో మారుతున్న నేర‌ ప‌రిస్థితుల నేప‌థ్యంలో నేర‌గాళ్లు ఎంత మాత్రం త‌ప్పించుకోలేని స్థితిలో మీరు కూడా కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.  ఫోరెన్సిక్ ద‌ర్యాప్తు లో డిఎన్‌ఎ ప్రొఫైలింగ్ కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది.  దీని స‌హాయం తో ఎన్నో సంక్లిష్ట కేసుల‌ను ఛేదించ‌డానికి అవ‌కాశం చిక్కింది.  లేకుంటే ఇటువంటి కేసులు అప‌రిష్కృతంగా ఉండిపోయేవి.  అందువ‌ల్ల డిఎన్‌ఎ ప్రొఫైలింగ్‌ ను ఉప‌యోగించి న్యాయ‌ వ్య‌వ‌స్థ‌ కు  స‌హ‌క‌రించ‌డం ద్వారా నేర‌గాళ్లకు వెంట‌నే శిక్ష‌ ప‌డి, బాధితుల‌కు న్యాయం జ‌రిగేటట్టు చూడ‌వ‌ల‌సివుంది.  ఫోరెన్సిక్ ద‌ర్యాప్తు లో డిఎన్‌ఎ టెక్నాల‌జీ ప్రాధాన్య‌ాన్ని గుర్తించి, మ‌న ప్ర‌భుత్వం డిఎన్‌ఎ టెక్నాల‌జీ (యూజ్‌, అప్లికేశన్‌) రెగ్యులేశన్ బిల్లు 2018 ను ఆమోదించింది.  ఈ బిల్లు ద్వారా అన్ని ర‌కాల డిఎన్‌ఎ ప‌రీక్ష‌లు న‌మ్మ‌క‌మైన‌విగాను, సుర‌క్షిత‌మైన‌విగాను ఉండేటట్టు చూడ‌డం జ‌రిగింది.  అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో డిఎన్‌ఎ విశ్లేష‌ణ- ప‌రిశోధ‌న కేంద్రాలను బ‌లోపేతం చేసేందుకు నిర్ణ‌యం తీసుకోవడమైంది.  చండీగఢ్ లోని కేంద్రీయ ఫోరెన్సిక్ సైన్స్ లేబ‌రెట‌రీ లో నిర్భ‌య ప‌థ‌కం లో భాగంగా అత్య‌ధునాత‌న ప‌రిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.  రాగ‌ల రోజుల‌లో మ‌నం మ‌హిళ‌ల‌పై జ‌రిగే నేరాలు, స‌మాజంలో చోటు చేసుకునే అత్యంత దారుణ‌మైన నేరాల‌ను అరిక‌ట్ట‌డ‌మే కాకుండా నేర‌స్థుల‌ను వెంట‌నే, క‌చ్చితంగా గుర్తించగ‌ల‌మ‌న్న విశ్వాసం నాకుంది.

ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఇటీవ‌ల ప‌త్రిక‌ల‌లో చూసే వుంటారు.. మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌ లోని మంద్‌సౌర్ జిల్లా లో మైన‌ర్ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన ఇద్ద‌రు రాక్ష‌సుల‌ కేసు లో ఒక న్యాయస్థానం విచార‌ణ ను ప్రారంభించిన రెండు నెల‌ల వ్య‌వ‌ధి లోనే విచార‌ణ ను ముగించి శిక్ష ను విధించిందని.   కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధి లో నేర‌గాళ్లకు శిక్ష విధించబడింది.  దీనికి ముందు మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌ లోని క‌ట్ నీ జిల్లా లో ఒక న్యాయస్థానం విచార‌ణ జ‌రిపి ఇటువంటి రాక్ష‌సుల‌కు ఐదు రోజుల్లో శిక్ష ను విధించింది. రాజ‌స్థాన్‌ లోని న్యాయస్థానాలు ఇలాగే వేగంగా స్పందించాయి.

ఫోరెన్సిక్ సైన్స్ రంగం లో గొప్ప ప‌రిశోధ‌న‌లు చేస్తున్న మీరు మహత్తర సేవ అందజేస్తున్నారు.  అత్యాచారం వంటి హేయ‌మైన నేరాల‌కు పాల్ప‌డే నేర‌గాళ్ల కేసుల‌లో మ‌న న్యాయ‌స్థానాలు స‌త్వ‌ర నిర్ణ‌యం తీసుకోవ‌డానికి దీనితో వీలు క‌లుగుతున్న‌ది.  మీ ప‌రిశోధ‌నల ప్ర‌భావం ఎంతగానో ఉంది.  ప్ర‌భుత్వం చ‌ట్టాన్ని మ‌రింత ప‌క‌డ్బందీగా రూపొందించింది; పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేస్తున్నారు. ఇవి ఎన్ని ఉన్నా, న్యాయ‌స్థానాలు స‌త్వ‌ర నిర్ణ‌యాలను తీసుకోవ‌డానికి బ‌ల‌మైన శాస్త్రీయ ఆధారాల‌ను న్యాయస్థానాల‌కు ఫోరెన్సిక్ సైన్స్ యే స‌మ‌కూరుస్తోంది.  ఇలా స‌త్వ‌ర న్యాయ‌ ప్ర‌క్రియ అమ‌లు తో నేర‌గాళ్లు న్యాయ‌ వ్య‌వ‌స్థ‌ నుండి త‌ప్పించుకోవ‌డానికి వీలు లేకుండాపోతుంది.  మీ సేవలు, నైపుణ్యం స‌మాజం లో హీన‌మైన నేరాలు జ‌ర‌గకుండా చూడ‌గ‌ల‌ద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.

మిత్రులారా,

దేశం లోని ప్ర‌తి రాష్ట్రంలో ఫోరెన్సిక్ సైన్స్‌ ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌భుత్వం అవిరళ కృషి చేస్తోంది.  దేశం లో రక్షక భట వ్య‌వ‌స్థ‌ ను ఆధునీక‌రించ‌డంలో భాగంగా గుజ‌రాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివ‌ర్సిటీ స్థాయి ని పెంచే ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌భుత్వం ఆమోదించింది.
 
జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి లలో నూత‌న సంస్థ‌లు, స‌ర్వోన్న‌త వ్య‌వ‌స్థ‌ల ఏర్పాటుకు పనులు సాగుతున్నాయి.  ఇందుకు సంబంధించిన ప్రాజెక్టు పై 300 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌నున్నాం.  ఇందులో 60 శాతం మొత్తాన్ని కేంద్ర ప్ర‌భుత్వం భ‌రిస్తుంది.  ఇందుకోసం గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 50 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేయ‌డంప‌ట్ల నేను సంతోషం వ్య‌క్తం చేస్తున్నాను.  ఈ మొత్తాన్ని ఫోరెన్సిక్ సైన్స్ సాంకేతిక విజ్ఞానం ఆధునీక‌ర‌ణ‌కు, విస్త‌ర‌ణ‌కు వినియోగించడం జ‌రుగుతుంది.

మిత్రులారా,

మీరు అధ్య‌య‌నానికి ఒక మంచి విషయాన్ని ఎంచుకొన్నారు.  ఫోరెన్సిక్ సైన్స్ త‌ర‌గ‌తి గ‌ది నుండి తెలుసుకొన్న కొన్ని సూత్రాలు సంద‌ర్భాలు వేరైనా జీవ‌న త‌ర‌గ‌తి గ‌ది లో అవి మీకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వారు మీకు వ్య‌క్తిత్వ‌ సూత్రాలను గురించి తెలియ‌జేశారు.  ఆ సూత్రాల‌ను మీ నిత్య‌జీవితం లోనూ మ‌రచిపోకండి.  ప్ర‌తి ఒక్క‌రి లోని ఆత్మ భ‌గ‌వ‌త్ స్వ‌రూప‌మ‌ని స్వామి వివేకానందుల వారు చెబుతూ ఉండే వారు.  అంటే మ‌న‌లో ప్ర‌తి ఒక్కరినీ తీసుకుంటే, మ‌న‌లో అద్భుత‌మైన శ‌క్తి ఉంది.  ఆ శ‌క్తి ని స‌ద్వినియోగం చేసుకోవ‌ల‌సివుంది.  ఇందుకు ముందుగా ఈ శ‌క్తి ని మ‌నం గుర్తించాలి.  మీపై మీకు విశ్వాసం ఉండాలి.  మీ శ‌క్తి సామ‌ర్ధ్యాల‌పై మీకు విశ్వాసం ఉండాలి.  నేరాల‌కు పాల్ప‌డే వారు నేర‌ ప్ర‌దేశానికి ఏదో ఒక‌టి తీసుకు వ‌చ్చి, నేర ప్ర‌దేశంలో ఏదో ఒక‌టి వ‌దిలివెళ‌తాడ‌ని లోకార్డ్ మీకు నేర్పాడు.  మీరు ఎప్పుడూ నేరాల‌కు సంబంధించిన కేసుల‌ను ఛేధిస్తూ వ‌స్తున్నార‌ని అనుకుంటున్నాను.  మీలో ప్ర‌తి ఒక్క విద్యార్థి స‌మాజానికి ఎంతో విలువను జతపరుస్తున్నార‌ని గుర్తు పెట్టుకోండి.  స‌మాజానికి విలువ ను జోడించ‌డంతో పాటు ఇత‌రుల‌ నుండి నేర్చుకోవ‌డం కూడా మ‌రచిపోకండి.  కొత్త ఆలోచ‌న‌లను, అభిప్రాయాలను స్వాగ‌తించ‌డానికి మీ మస్తిష్కరం ద్వారాలను తెర‌వండి.  మీ ఆలోచ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని సుసంప‌న్నం చేయండి.  ఇత‌రుల ఆలోచ‌న‌ల‌లో అత్యుత్త‌మ‌మైన వాటిని స్వీక‌రించండి.  ఈ వైవిధ్యం మిమ్మ‌ల్ని ఒక గొప్ప‌ వ్య‌క్తి ని చేస్తుంది.  నేను అభ్యుద‌య‌క‌రమైన మార్పు ను గురించి ప్ర‌స్తావిస్తే , దీని గురించి మీకు ఏం చెప్పారో స‌హ‌జంగా మీ స్ఫురణకు వ‌స్తుంది.  అలాగే రాబోయే రోజుల గురించి కూడా ఆలోచిస్తారు.  అనుక్ష‌ణం పరివర్తనకు లోనయ్యే స‌మాజం లో మ‌నం ఇప్పుడు ఉన్నాం.  అత్యాధునిక ఆవిష్క‌ర‌ణ‌లు మ‌న కాలంలో కీల‌కం.  కొత్త ఆలోచ‌న పాతబ‌డిపోవడానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌డం లేదు.  యువ‌జనులు, ప్ర‌జ‌లు సాధారణానికి భిన్నమైన ప‌రిష్కారాల‌ను రికార్డు స‌మ‌యంలో క‌నుక్కోగ‌లుగుతున్నారు.  అలాగే మీరు కూడా ప్ర‌పంచ‌వ్యాప్త మార్పు ధోర‌ణుల‌కు కేంద్ర బిందువుగా ఉండాలి.  మీ విద్య‌, మీ తెలివితేట‌లు, మీకు ఇచ్చిన శిక్ష‌ణ మిమ్మ‌ల్ని భిన్నంగా ఆలోచించే స్థితిలో ఉంచాయి.  ఈ నైపుణ్యాల‌ను మ‌న‌ చుట్టూరా ఉన్న ప‌రిస్థితుల‌ను మార్చ‌డానికి మాత్ర‌మే కాక మ‌న ప్ర‌పంచాన్ని మంచి నివాస‌యోగ్య‌మైంది గా చేసేందుకు అభ్యుద‌య‌క‌ర మార్పు దిశ‌ గా కృషి చేయాలి.  ఇందుకు రానున్న త‌రాలు మీకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటాయి.  మిత్రులారా, యువ‌త తోడ్పాటు లేకుండా, వారి ప్ర‌మేయం లేకుండా ఏ కార్య‌క్ర‌మ‌మూ విజ‌య‌వంతం కాదు.  మీరు ఇక్క‌డ స‌మ‌కూర్చుకున్న విజ్ఞానం స‌మాజానికి సేవ చేయ‌డానికి మీకు స‌మ‌ర్థ‌వంతంగా తోడ్ప‌డుతుంద‌ని, వృత్తిప‌ర‌మైన విజ‌యాన్ని ఇస్తుంద‌ని ఆశిస్తున్నాను.  మీరు చ‌దువుకున్న విశ్వ‌విద్యాల‌యం పేరు ప్ర‌తిష్ఠ‌ల‌ను మ‌రింత ఇనుమ‌డింప‌చేస్తార‌ని ఆశిస్తున్నాను.  ఇక్క‌డ ప‌ట్టాలు అందుకుంటున్న విద్యార్థులంద‌రి భ‌విష్య‌త్తు ఉజ్వ‌ల‌ంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను.

ఈ రోజు ఇక్క‌డ ఎక్కువ‌గా విద్యార్థినుల‌కు ప‌త‌కాలు రావ‌డం నేను గ‌మ‌నించాను.  విద్యార్థుల‌కు కొన్ని ప‌త‌కాలు మాత్ర‌మే వ‌చ్చాయి. చూడండి, ఇది మారుతున్న కాలం.  విద్యార్థినుల‌కు, వారి త‌ల్లితండ్రుల‌కు ఇవే ప్ర‌త్యేక అభినంద‌న‌లు.  పుత్రికల‌కు ప్ర‌త్యేకంగా నా ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లను తెలియజేస్తున్నాను.

మీకందరికీ అనేక ధ‌న్య‌వాదాలు.

 **