Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురుత్వాకర్షక తరంగాలను కనుగొన్నందుకు హర్షం వెలిబుచ్చిన ప్రధాన మంత్రి ; ఈ పథకంలో పాలు పంచుకొన్న భారతీయ శాస్త్రవేత్తల పాత్రకు ప్రశంసలు


గురుత్వాకర్షక తరంగాల ఆచూకీ తీసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకంలో భారతీయ శాస్త్రజ్ఞులు పోషించిన భూమికకు ఆయన కితాబిచ్చారు.

“గురుత్వాకర్షక తరంగాలను గురించిన‌ ఆరా తీయడం చారిత్రక పరిణామం. విశ్వం పట్ల అవగాహనను పెంచుకొనేందుకు సాగిస్తున్న ప్రస్థానంలో ఈ ప‌థ‌కం ఒక సరికొత్త సీమకు తలుపుల‌ను తెరిచింది.

సవాలుతో కూడిన ఈ అన్వేషణలో భారతీయ శాస్త్రవేత్తలు ముఖ్య పాత్రను పోషించడం ఎంతో గర్వ కారణమైన విష‌యం.

దేశంలో అడ్వాన్స్ డ్ గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్ ను కలిగి ఉండటం కన్నా మరింత గొప్పదైన కార్యాన్ని సాధించడానికి ముందడుగు వేయాలని ఆశిద్దాం” అని ప్రధాన మంత్రి ట్విటర్ లో పేర్కొన్నారు.

***