Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం సంభవించి 5వ సంవత్సరం వచ్చిన వేళ బాధితులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


గ్రేట్ ఈస్ట్ జపాన్ లో భూకంపం సంభవించి 5వ సంవత్సరం వచ్చిన తరుణంలో ఆ ఘటన వల్ల బాధితులైన కుటుంబాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

“గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపానికి గురై అయిదు సంవత్సరాలైన సందర్భంలో బాధిత ప్రజల పట్ల భారతదేశం తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నది. ఈ విపత్తు నుంచి త్వరగా కోలుకొని తిరిగి సాధారణ జీవన పథంలోకి తిరిగివచ్చేందుకు జపాన్ ప్రజలు కనబరచిన మనోనిబ్బరాన్ని మేం మెచ్చుకొంటున్నాం” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***