Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చండీగఢ్‌ లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని

చండీగఢ్‌  లో ప్రధాని


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చండీగఢ్ విమానాశ్రయంలో నూతన పౌర విమాన ప్రాంగణాన్ని ప్రారంభించారు.

చండీగఢ్‌లోని పీజీఐఎమ్ఈఆర్ (పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) 34 స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. 1893లో ఇదే రోజు (సెప్టెంబర్, 11న) చికాగోలో ప్రపంచ సర్వమత సదస్సులో స్వామీ వివేకానంద చేసిన ప్రసంగాన్ని గుర్తుచేశారు. ఆరోజు ప్రసంగంలో స్వామీ వివేకానంద చెప్పిన మానవతా విలువలను ప్రపంచం గ్రహించి.. ఆచరించి ఉంటే నేడు ఉగ్రవాదం, 9/11 దాడులు జరిగి ఉండేవి కావన్నారు.

కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చూసి ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వారే ముఖ్య అతిథులని కొనియాడారు. ఈ సందర్భం ఈ చిన్నారులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రాడ్యయేట్ విద్యార్థులతో మాట్లాడుతూ.. స్నాతకోత్సవ కార్యక్రమం (దీక్షాంత్ సమారోహ్) తర్వాత ఇంతిటితో చాలని చదువును ఆపేయవద్దని (శిక్షాంత సమారోహ్ కావొద్దని) తెలిపారు. ఇన్నాళ్లూ పుస్తకాలే ప్రపంచంగా.. అందులోని విషయాలు చదువుకున్న వారు.. వాస్తవ ప్రపంచంలోకి అడుతుపెట్టడమే.. ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని సూచించారు.

“తాము కష్టపడి చదివినందుకే నేడు వైద్య విద్య పూర్తి చేశామని అనుకుంటున్నవారు.. ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ వైద్య విద్య నేర్చుకునే క్రమంలో మీ మేథస్సుతోపాటు సమాజంలో చాలా మంది భాగస్వామ్యం కూడా ఇందులో ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.” అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మీ జీవితంలో వేసే ప్రతి అడుగులో పేదలను మనస్సులో పెట్టుకోవాలన్నారు.

సంపూర్ణ ఆరోగ్యం సాధించే ప్రయత్నంలో.. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ధోరణిని గమనించాలని ప్రధాని సూచించారు.

వ్యాధులను నయం చేయటమే కాకుండా.. రోగులతో ఓ మంచి అనుబంధాన్ని కొనసాగించాలని గ్రాడ్యుయేట్లను కోరారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలను ప్రధాని అందజేశారు.

చండీగఢ్‌లోని సెక్టార్-25లో నూతన గృహ సముదాయ పథకాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. వేదికపై కొందరు మాజీ సైనికులు ప్రధానిని సన్మానించారు. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబం దేశానికి ‘సురక్ష కవచం’ వంటిదని మోదీ అన్నారు. ఈ ప్రాంతం నుంచి చాలా మంది సాయుధ బలగాల్లో చేరుతున్నారని ప్రశంసించారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం భద్రతా బలగాలకు ‘ఓఆర్ఓపీ – వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని ప్రధాని తెలిపారు. ఈ ఘనత దేశంలోని పేదలు, సామాన్య ప్రజలదేనని ఆయన స్పష్టం చేశారు.

పార్లమెంటులో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, ఇందులో పార్లమెంటు పాత్ర, పనితీరుపై సభ్యుల్లో కనీస అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. పార్లమెంటులో ప్రతి ఒక్క విషయంపై చర్చ జరగాలని కానీ.. అంతరాయం కలిగించటం వల్ల సాధించేదేమీ ఉండదన్నారు. పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్ఠభన వల్ల జన సభ (నేరుగా ప్రజల వద్దే)లో విషయాలను చర్చించాల్సిన అవసరం వచ్చిందన్నారు.

చండీగఢ్‌ హౌజింగ్ బోర్డు పౌరుల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వాలు సాంకేతికత పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ప్రజల స్వావలంబన పెరుగుతుందన్నారు. 2022కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున అప్పటి వరకు దేశంలో ప్రతి ఒక్కరికీ ఒక ఇల్లు ఉండేలా చూస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన అవగాహన ఉందని ప్రధాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని వాస్తవం చేసే దిశగా పనిచేస్తోందన్నారు.