పిఎంఇండియా
చండీగఢ్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ & వాటర్ కాన్సర్వేశన్ రిసర్చ్ సెంటర్ (ఐ ఐ ఎస్ డబ్ల్యు సి) కి చెందిన 13111.55 చదరపు మీటర్ల భూమిని హరియాణా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ యు డి ఎ) కి బదిలీ చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. పంచ్ కులా లోని మానసా దేవి కాంప్లెక్స్ (ఎమ్ డి సి)లో ఈ కింద తెలిపిన విధంగా 60 మీటర్ల పెరిఫెరల్ మాస్టర్ రోడ్డు ను నిర్మించడం కోసం ఈ భూమి మార్పిడిని ఉద్దేశించారు.. :
అ) ఐ ఐ ఎస్ డబ్ల్యు సి రిసర్చ్ సెంటర్ కు చెందిన 13,290.30 చదరపు మీటర్ల భూమిని ఆ రోజు వర్తించే కలెక్టర్ రేటు కు హెచ్ యు డి ఎ కి బదిలీ చేయాలి.
ఆ) హెచ్ యు డి ఎ కి చెందిన 178.75 చదరపు మీటర్ల భూమిని చండీగఢ్ లోని ఐ ఐ ఎస్ డబ్ల్యు సి రిసర్చ్ సెంటర్ కు బదిలీ చేయాలి.
ఇ) ఐ ఐ ఎస్ డబ్ల్యు సి రిసర్చ్ సెంటర్ కు, హెచ్ యు డి ఎ కి మధ్య 410 చదరపు మీటర్ల భూమి పరస్పరం మార్పిడి జరగాలి.
పంచ్ కులా లోని మానసా దేవి కాంప్లెక్స్ (ఎమ్ డి సి)లో పెరిఫెరల్ మాస్టర్ రోడ్డు ను నిర్మించడం కోసం ప్రభుత్వ భూమిని బదలాయించడం ఆ ప్రాంతంలో
వృద్ధికి, పురోగతికి బాటను పరచగలుగుతుంది. అక్కడ మరిన్ని ఉపాధి అవకాశాలకు దారి తీయగలుగుతుంది కూడా. కీలక రంగాలలో మౌలిక సదుపాయాలకు ఊతం అందించాలని, తద్వారా మొత్తంమీద ఆర్థిక వృద్ధిని పెంపొందించాలన్న ప్రభుత్వ ప్రణాళికలలో ఈ నిర్ణయం ఒక భాగంగా ఉంది.