ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఛత్తీస్గఢ్ గిరిజన సంస్కృతికి, ప్రాకృతిక సంపదకు, విశిష్ట జానపద సంప్రదాయాలకు ప్రసిద్ధి పొందిందని శ్రీ మోదీ అన్నారు. ఈ రాష్ట్రానికి ఉన్న ఘనమైన పురావస్తు శాస్త్ర సంబంధి వారసత్వం కూడా ఈ రాష్ట్రానికి ప్రముఖ గుర్తింపును తీసుకువచ్చిందని ఆయన అన్నారు. చైతన్యవంతమైన ఈ రాష్ట్ర జానపద సంస్కృతి ఇక్కడి వాతావరణాన్ని సుసంపన్నం చేస్తోందని, ఈ ఆప్యాయభరిత వాతావరణంతో అనుబంధాన్ని నిరంతరం కలిగివుండాలన్న అద్భుత భావనను అందరిలో ప్రోది చేసి వారిని ఈ రాష్ట్రం తన వైపునకు ఆకర్షిస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
‘‘నక్సలిజం వేళ్లను మన రాష్ట్రం పెకలించివేసి అభివృద్ధి మార్గంలో కొత్త వేగంతో ముందుకు పయనిస్తోందని తెలిసి ఎంతో సంతోషం కలుగుతోంది. రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులు, కష్టపడి పనిచేసే ప్రజల భాగస్వామ్యంతో, దేశ సమృద్ధి సాధన ప్రయత్నాలలో ఛత్తీస్గఢ్ ఇక మీదట కూడా కీలక పాత్రను పోషిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘ఛత్తీస్గఢ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి అనేకానేక శుభాకాంక్షలు.
ఈ రాష్ట్రం గిరిజన సంస్కృతికి, ప్రాకృతిక సంపదకు, అద్భుత జానపద సంప్రదాయాలకు పేరెన్నికగన్నది. రాష్ట్ర పురాతత్వ వారసత్వ ప్రతీకలు దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక్కడి జానపద సంస్కృతిలోని అద్భుత ఆప్యాయత ప్రతి ఒక్కరినీ తన వైపునకు ఆకర్షించుకొంటోంది.
నక్సలిజాన్ని సమూలంగా అంతం చేసి మన ఈ రాష్ట్రం ప్రగతిపథంలో శరవేగంగా దూసుకుపోతుండటం చూస్తే సంతోషం కలుగుతోంది. ప్రతిభాశాలురు, కష్టపడి పనిచేసే నా కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో ఈ రాష్ట్రం.. దేశ సమృద్ధి సాధన కృషిలో అమితోత్సాహంతో పాలుపంచుకొంటుందని నేను నమ్ముతున్నాను.
ఈ విశిష్ట సందర్భం ఛత్తీస్గఢ్ ప్రజలందరికి మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను.’’
छत्तीसगढ़ के सभी निवासियों को राज्य के स्थापना दिवस की अनेकानेक शुभकामनाएं! यह प्रदेश अपनी जनजातीय संस्कृति, प्राकृतिक संपदा और अनूठी लोक परंपराओं के लिए प्रख्यात है। राज्य की पुरातात्विक धरोहरें इसकी विशेष पहचान रही हैं। यहां की लोक-संस्कृति से परिपूर्ण परिवेश में एक अद्भुत अपनापन है, जो हर किसी को अपनी ओर आकर्षित करता है। आज यह देखकर खुशी होती है कि नक्सलवाद की जड़ें खत्म करते हुए हमारा यह राज्य विकास के पथ पर और तेज रफ्तार से आगे बढ़ रहा है। मुझे विश्वास है कि मेरे प्रतिभाशाली और परिश्रमी परिवारजनों की भागीदारी से यह प्रदेश राष्ट्र की समृद्धि में बढ़-चढ़कर योगदान देता रहेगा। यह विशेष अवसर छत्तीसगढ़ के सभी निवासियों के लिए कल्याणकारी हो, यही कामना है!
— Narendra Modi (@narendramodi) November 1, 2026