Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఛత్తీస్ గఢ్ లో సిఆర్ పిఎఫ్ సిబ్బందిపై జరిగిన దాడి శోచనీయమన్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లో సిఆర్ పిఎఫ్ సిబ్బందిపైన జరిగిన దాడి పిరికిపంద చేష్టే కాక శోచనీయమైన ఘటన కూడా అని అన్నారు. సిఆర్ పిఎఫ్ సిబ్బంది పరాక్రమాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. మృత వీరుల త్యాగం వృథా పోదని ఆయన చెప్పారు.

“ఛత్తీస్ గఢ్ లో సిఆర్ పిఎఫ్ సిబ్బందిపైన జరిగిన దాడి పిరికిపంద చేష్ట. అంతే కాదు, విచారకరమైనటువంటి ఘటన. మేం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం.

సిఆర్ పిఎఫ్ సిబ్బంది ప్రదర్శించిన పరాక్రమం మనకు ఎంతో గర్వకారణం. మృత వీరుల త్యాగం వ్యర్థం కాదు. వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను.

ఛత్తీస్ గఢ్ లో ఈ రోజు జరిగిన దాడిలో గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.