పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
“ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నాడు ఆయనకు నేను ప్రణమిల్లుతున్నాను. ఆయన వంటి పరాక్రమవంతుడు, ఒక మహానుభావుడు మన దేశంలో జన్మించినందుకు భారతదేశం గర్వపడుతోంది.
శివాజీ మహరాజ్ తన ప్రజల శ్రేయస్సును మిగతా అన్నింటి కన్నా మిన్నగా భావించారు. ఆయన అసాధారణమైన పరిపాలనా నైపుణ్యం మూర్తీభవించిన ఆదర్శప్రాయుడైన పాలకుడు.
శివాజీ మహరాజ్ యొక్క ఆదర్శాలను నెరవేర్చడం కోసం, ఆయన గర్వపడే భారతావనిని ఆవిష్కరించడం కోసం మేము అలుపెరగకుండా కృషి చేస్తున్నాము.
ఈ మధ్యే అరేబియా సముద్రతీరానికి ఆవల జరిగిన శివాజీ మహరాజ్ విగ్రహానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొనే గౌరవం నాకు దక్కింది. ఆ రోజును నేను ఎప్పటికీ మనసులో పదిలపరచుకొంటాను” అని ప్రధాన మంత్రి అన్నారు.
छत्रपती शिवाजी महाराज यांच्या जयंतीदिनी त्यांना नमन. त्यांच्यासारखे शूर आणि महान व्यक्तिमत्व आपल्या भूमीत जन्मले याचा भारताला अभिमान आहे. pic.twitter.com/7ywOC0GKii
— Narendra Modi (@narendramodi) February 19, 2017
छत्रपती शिवाजी महाराज यांनी नेहमीच प्रजेच्या कल्याणाला सर्वोच्च प्राधान्य दिले. ते एक उत्तम प्रशासकीय कौशल्य लाभलेले आदर्श राज्यकर्ते होते.
— Narendra Modi (@narendramodi) February 19, 2017
शिवाजी महाराजांना अभिमान वाटेल असा भारत घडवण्यासाठी आम्ही अविरत प्रयत्नशील आहोत.
— Narendra Modi (@narendramodi) February 19, 2017
नुकतेच अरबी समुद्रात उभारल्या जाणाऱ्या भव्य शिवस्मारकचे जल-भूमिपूजन कार्यक्रमाला उपस्थित राहण्याचे भाग्य लाभले. हा दिवस सदैव स्मरणात राहील.
— Narendra Modi (@narendramodi) February 19, 2017