Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఛ‌త్తీస్ గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ బలరాంజీ దాస్ టండన్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఛ‌త్తీస్ గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ బలరాంజీ దాస్ టండన్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“ఛ‌త్తీస్ గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ బలరాంజీ దాస్ టండన్ మ‌ర‌ణం దు:ఖదాయకం. అమిత గౌర‌వాన్వితుడైన ఒక ప్ర‌జా ప్ర‌ముఖుడిని మ‌నం కోల్పోయాం; ఆయన స‌మాజానికి అందించిన సేవలు చిర స్మ‌ర‌ణీయమైనవి. ఈ దుఃఖ ఘ‌డియ లో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు మ‌రియు హితైషుల‌కు క‌లిగిన వేద‌న‌లో నేను కూడా పాలుపంచుకొంటున్నాను.

పంజాబ్ లో శాంతి కోసం, ప్ర‌గ‌తి కోసం శ్రీ బలరాంజీ దాస్ టండన్ ద‌శాబ్దాల త‌ర‌బ‌డి శ్ర‌మించారు. ప‌రిశ్ర‌మ‌ మరియు కార్మిక సంక్షేమం వంటి రంగాల ప‌ట్ల ఆయ‌న లో ఓ ఉద్వేగం ఉండేది. ప‌రిపాల‌న ప‌రంగా ఆయ‌న‌కు ఉన్న అనుభ‌వం రాష్ట్రానికి గొప్ప విలువ‌ను జోడించేదే. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని వ్య‌తిరేకించ‌డం లో చూపిన సాహ‌సానికిగాను ఆయన గుర్తుండిపోతారు” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.

***