జగదంబిక అమ్మవారిని స్తుతిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సకల పదాలలో, ఆలోచనలలో, సర్వ రూపాలలో మాత దివ్య అస్తిత్వంతో అలరారుతున్నట్లు ఈ సుభాషితం ప్రకటిస్తున్నది. అన్ని శబ్దాలూ దేవీమాతను ప్రశంసించే అభివ్యక్తీకరణలేనని, దేవీ మాత దివ్య రూపం అన్ని లోకాలలోనూ, అన్ని రూపాల్లోనూ ఆవరించి ఉన్నదనే సందేశాన్ని ఈ శ్లోకం మనకు అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘నవ చ కా కిల న స్తుతిరమ్బికే! సకలశబ్దమయీ కిల తే తనుః
నిఖిలమూర్తిషు మే భవదన్వయో మనసిజాసు బహిఃప్రసరాసు చ’’.
तव च का किल न स्तुतिरम्बिके! सकलशब्दमयी किल ते तनुः। निखिलमूर्तिषु मे भवदन्वयो मनसिजासु बहिःप्रसरासु च॥ https://t.co/gh1E9Ylz9h
— Narendra Modi (@narendramodi) October 16, 2026