Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జన్‌జాతి సురక్షా మంచ్ ప్రతినిధులతో ప్రధానమంత్రి భేటీ


జన్‌జాతి సురక్షా మంచ్ ప్రతినిధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
గిరిజన సమాజం పట్ల వారు కనబరుస్తున్న అంకిత భావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
మాటామంతీలో భాగంగా, గిరిజన సముదాయాల అభివృద్ధితో, సాధికారతతో ముడిపడిన వివిధ అంశాలపై చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :

‘‘జన్‌జాతి సురక్షా మంచ్ ప్రతినిధులతో న్యూఢిల్లీలో సమావేశమయ్యే అవకాశం ఈ రోజు లభించింది. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకిత భావం ఎంతో ప్రశంసనీయం. గిరిజన సముదాయాల అభివృద్ధి, సాధికారతతో ముడిపడిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు చోటుచేసుకున్నాయి’’ అని పేర్కొన్నారు.

 

***