Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి.రాధాకృష్ణన్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తనకు ఆత్మీయ, ఆలోచనాత్మక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి.రాధాకృష్ణన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “ప్రతి పౌరుడికీ సాధికారత సహా ప్రగతి ఫలాలు దేశం నలు మూలలకూ చేరేలా చూడటంతోపాటు  వికసిత భారత్ రూపకల్పనపై సమష్టి సంకల్ప సాకారం దిశగా సరికొత్త శక్తితో, దృఢ దీక్షతో కృషి చేస్తాం” అని ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రకటించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి.రాధాకృష్ణన్ గారూ… మీ ఆత్మీయ, ఆలోచనాత్మక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ప్రతి పౌరుడికీ సాధికారత, అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి మూలకూ చేరేలా చూడటం సహా సమైక్య భారత్‌ను రూపుదిద్దడంలో మన సమష్టి సంకల్ప సాకారానికి మేం నవ్యోత్తేజంతో, దృఢ సంకల్పంతో మా కృషిని కొనసాగిస్తామని వాగ్దానం చేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***