Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు ప్రధానమంత్రి ధన్యవాదాలు


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. ప్రగతిశీల, సుసంపన్న, స్వయంసమృద్ధ భారత్‌, వికసిత భారత్‌ సంకల్ప సాకారం దిశగా దేశం నిరంతరం నవ్యోత్తేజంతో, శరవేగంగా దూసుకెళ్తోందని శ్రీ మోదీ ఈ సందర్భంగా అన్నారు. ఈ ప్రస్థానంలో గౌరవనీయ రాష్ట్రపతి మార్గదర్శకత్వం, స్ఫూర్తి అమూల్యమని వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజా సేవ లక్ష్యంగా తన అవిరళ కృషి మరింత బలోపేతం కాగలదని పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారూ! నా జన్మదినం సందర్భంగా మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ఎనలేని కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రగతిశీల, సుసంపన్న, స్వయంసమృద్ధ, వికసిత భారత్‌ రూపకల్పన సంకల్పంతో మనం నేడు నవ్యేత్తేజంతో, శరవేగంగా ముందడుగు వేస్తున్నాం. ఈ క్రమంలో మీ మార్గదర్శకత్వం, స్ఫూర్తి మాకెంతో అమూల్యం. దీనివల్ల ప్రజా సేవ దిశగా మా కృషి మరింత బలోపేతం అవుతుంది. ప్రజల భాగస్వామ్యంతో, భారతీయ సుసంపన్న వారసత్వం, ఆధునిక ప్రగతి సమ్మేళనంతో దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడంపై మేమెంతో నిబద్ధతతో కృషి చేస్తున్నాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***