పిఎంఇండియా
జపాన్ ఓపెన్-2026 టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్రాత్మక ఘనత సాధించిన భారత స్టార్ షట్లర్ పి.వి. సింధును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. టోర్నమెంట్ ఆసాంతం సింధు పట్టుదల, అసాధారణ నైపుణ్యాలు ప్రస్ఫుటంగా కనిపించాయన్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది యువ క్రీడాకారులు ఈ క్రీడలో పాల్గొని, మెరుగ్గా రాణించేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
భారత బ్యాడ్మింటన్‌లో చరిత్రాత్మక విజయం!
జపాన్ ఓపెన్-2026లో విజయం సాధించిన పి.వి. సింధుకు అభినందనలు. టోర్నమెంట్ ఆసాంతం ఆమె పట్టుదల, అసాధారణ నైపుణ్యాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు సాధించిన ఈ ఘనత మరింత ప్రత్యేకమైనది. దేశవ్యాప్తంగా అనేక మంది యువ క్రీడాకారులు ఈ క్రీడలో పాల్గొనడానికి, మెరుగ్గా రాణించడానికి ఈ విజయం స్ఫూర్తినిస్తుంది.
***
A historic feat for Indian badminton!
— Narendra Modi (@narendramodi) July 19, 2026
Congratulations to PV Sindhu for emerging victorious in the Japan Open 2026. Her determination and exceptional skills were on full display throughout the tournament. The fact that she is the first Indian to win this title makes this…