Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జపాన్ కొత్త ప్రధాని సానే తాకాయిచీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


జపాన్ ప్రధానమంత్రి పదవికి సానే తాకాయిచీ ఎన్నికైన సందర్భంగాప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు. ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ భారత్జపాన్‌ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీప్రపంచ స్థాయి భాగస్వామ్యాన్నీ మరింత బలపరుచుకోవాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా రాశారు:

‘‘సానే తాకాయిచీ.. మీరు జపాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన సందర్భంగా మీకు హృదయపూర్వక అభినందనలుభారత్జపాన్‌ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీప్రపంచ స్థాయి భాగస్వామ్యాన్నీ మరింత బలపరుచుకోవడానికి మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాఇండోపసిఫిక్ ప్రాంతం పొడవునాఅంతకన్నా విస్తృత స్థాయిలోనూ శాంతిసుస్థిరత్వంసమృద్ధి చిరకాలం కొనసాగేందుకు మన మధ్య సంబంధాలు మరింత ముందుకు వెళ్లడం ఎంతో అవసరం.’’

 

***