Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జపాన్ మాజీ ప్రధాని దివంగత షింజో అబే సతీమణి శ్రీమతి అకీ అబేతో ప్రధానమంత్రి భేటీ


జపాన్ మాజీ ప్రధానమంత్రి దివంగత షింజో అబే సతీమణి శ్రీమతి అకీ అబేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూఢిల్లీలో కలిశారు. భారత్‌తో ఆమెకు కొనసాగుతున్నసుదీర్ఘ అనుబంధాన్ని శ్రీ మోదీ అభినందించారు.

 

 

 

షింజో అబే తనకు ఎంతో ఆప్తమైన మిత్రుడని, దూరదృష్టి కలిగిన నాయకుడిగా ప్రధానమంత్రి శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. భారత్-జపాన్ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో షింజో అబే కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.

 

 

 

వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో నిన్న అబే మెమోరియల్ కారిడార్ ప్రారంభించడం, భారత్-జపాన్ స్నేహ సంబంధాల కోసం షింజో అబే చేసిన శాశ్వత కృషికి తగిన నివాళి అని శ్రీ మోదీ అన్నారు.

 

 

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

 

 

 

‘‘జపాన్ మాజీ ప్రధానమంత్రి దివంగత షింజో అబే సతీమణి శ్రీమతి అకీ అబేను కలవడం ఆనందంగా ఉంది. భారత్‌తో ఆమెకు కొనసాగుతున్న చిరకాల అనుబంధాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నాను.

 

 

 

అబే గారు నాకు ఎంతో ఆప్తమైన మిత్రుడు, దూరదృష్టి కలిగిన నాయకుడు. భారత్-జపాన్ సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిన్న వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో అబే మెమోరియల్ కారిడార్‌ను ప్రారంభించడం.. భారత్-జపాన్ స్నేహానికి ఆయన అందించిన శాశ్వతమైన సేవలకు తగిన నివాళి’’ .