Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ రుర్బన్ మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని

జాతీయ రుర్బన్ మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా కురుభట్ గ్రామంలో జాతీయ రుర్బన్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గ్రామాలను క్లస్టర్లుగా మార్చి అభివృద్ధి చేసేందుకే రుర్బన్ మిషన్ ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులు కల్పించటమే దీని ఉద్దేశ్యమన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణ పథకంలో భాగంగానే స్మార్ట్ గ్రామాలకోసం దీన్ని ప్రారంభించామన్నారు. రుర్బన్ క్లస్టర్లు ఆర్థిక లావాదేవీలకు కేంద్రస్థానంగా మారతాయని ప్రధాని తెలిపారు. దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గణనీయమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.

అభివృద్ధిలో దేశం కొత్త పుంతలు తొక్కుతుందని ప్రధాన మంత్రి తెలిపారు. రుర్బన్‌ మిషన్ ఢిల్లీనుంచి కాకుండా.. ఛత్తీస్‌గఢ్‌లోని కురుభట్ గ్రామంనుంచి ప్రారంభించటమే దీనికి ఓ ఉదాహరణ అని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాల దగ్గరకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చామని ప్రధాని తెలిపారు. కురుభట్ సమీపంలోని గ్రామాలు బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా గుర్తించబడటాన్ని ప్రధాని అభినందించారు. అంతకుముందు, వేదిక సమీపంలో ఏర్పాటుచేసిన అభివృద్ధి పథకాల అమలు, కళాకారులు రూపొందించిన ఆకృతులతో ఏర్పాటుచేసి ప్రదర్శనను ప్రధాని సందర్శించారు.