Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జార్జ్ ఫెర్నాండెజ్ గారి క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి


శ్రీ జార్జ్ ఫెర్నాండెజ్ క‌న్నుమూత ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక సందేశం లో “భార‌త‌దేశ రాజ‌కీయ నాయ‌క‌త్వం లో శ్రేష్ఠ‌త్వాని కి జార్జ్ సాహ‌బ్ ప్రాతినిధ్యం వహించారు.

నిష్కాపట్యం తో, నిర్భయత్వం, ముక్కుసూటి తనం మ‌రియు దూర‌దృష్టి కలిగిన వ్య‌క్తి అయిన ఆయ‌న మన దేశాని కి విలువైన తోడ్పాటు ను అందించారు. పేద‌ల మ‌రియు ఆద‌ర‌ణ నోచుకోని వ‌ర్గాల హ‌క్కుల కోసం అత్యంత ప్ర‌భావశీలమైన వాణి ని వినిపించిన వారిలో ఆయ‌న కూడా ఒక‌రు.

ఆయ‌న మ‌ర‌ణం తో దుఃఖితుడినయ్యాను.

శ్రీ జార్జ్ ఫెర్నాండెజ్ ను గురించి మ‌నం మననం చేసుకొన్న‌ప్పుడు, న్యాయం కోసం తీవ్ర పోరు సల్పిన కార్మిక సంఘ నాయ‌కుడి ని, శక్తిశాలులైన రాజ‌కీయ నాయ‌కుల పై ఎన్నికల రంగం లో పైచేయి ని సాధించగల నేత ను, దార్శ‌నిక‌త క‌లిగినటువంటి రైల్వే మంత్రి నే కాకుండా భార‌త‌దేశాన్ని భ‌ద్ర‌మైంది గా, బ‌ల‌మైంది గా మార్చినటువంటి ఒక గొప్ప ర‌క్ష‌ణ మంత్రి ని మ‌నం గుర్తు కు తెచ్చుకొంటాం.

ప్ర‌జా జీవ‌నం లో గడిపిన సుదీర్ఘ కాలం లో, జార్జ్ సాహ‌బ్ ఎన్న‌డూ త‌న రాజ‌కీయ సైద్ధాంతికత నుండి మడమ తిప్పి ఎరుగరు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి కి ఆయన ఎదురొడ్డి నిలచారు. ఆయ‌న బోళా త‌నం, ఇంకా అణకువ లు ప్ర‌శంసపాత్రమైనటువంటివి. ఆయ‌న కుటుంబ స‌భ్యుల, మిత్రుల, ఇంకా శోకిస్తున్న ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల యొక్క మ‌నోభావాల తో నేను మ‌మేకమవుతున్నాను. ఆయ‌న ఆత్మ కు శాంతి ల‌భించుగాక’’ అని పేర్కొన్నారు.