Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జిఎస్ఎటి-11 ని విజ‌య‌వంతంగా ప్ర‌యోగించినందుకు ఐఎస్ఆర్ఒ (‘ఇస్రో’) కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


జిఎస్ఎటి-11 ను ప్ర‌యోగించ‌డం లో స‌ఫ‌ల‌ం అయినందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ..‘ఇస్రో’) ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

“మ‌న అంత‌రిక్ష కార్య‌క్ర‌మం లో ఇది ఒక ప్ర‌ధాన‌మైన‌టువంటి మైలు రాయి.. సుదూర ప్రాంతాల‌ ను జోడించ‌డం ద్వారా కోట్లాది భార‌తీయుల జీవితాల‌ లో పరివర్తన ను తీసుకు రాగ‌లుగుతుంది. భార‌త‌దేశాని కి చెందిన అతి బ‌రువైన, అత్యంత పెద్ద‌దైన మ‌రియు అత్య‌ాధునిక సంచార ఉపగ్రహం అయినటువంటి జీశాట్ (జిఎస్ఎటి)-11 ని ప్ర‌యోగించ‌డం లో స‌ఫ‌ల‌మైన ‘ఇస్రో’ కు ఇవే అభినంద‌న‌లు.

దేశం లో నిత్య నూత‌న ఆవిష్కారాల‌ ను, విజయాలను సాధిస్తున్నటువంటి మ‌రియు కార్య సాఫల్యాల్లో ఉన్న‌త‌ ప్ర‌మాణాల‌మైన కీర్తి ని సముపార్జిస్తున్నటువంటి మ‌న శాస్త్రవేత్త‌లు భార‌త‌దేశానికి గర్వకారణం. వారి అసాధార‌ణ‌ ప్రయత్నాలు భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి కి ప్రేరణ‌ ను అందించేవే” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

**