పిఎంఇండియా
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనవిగా మార్చుకోవడంలో సంకల్పం, పట్టుదల, ధైర్యానికున్న శక్తిని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘దైవం పురుషకారేణ యః సమర్థః ప్రబాధితుమ్।
న దైవేన విపన్నార్థః పురుషః సోవసీదతి॥’’
ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనవిగా మార్చుకొనే సంకల్పం, పట్టుదల, ధైర్యం ఉన్న వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఎన్నడూ ఓడిపోడు. బదులుగా, నిరంతర కృషి, చెక్కుచెదరని సంకల్పంతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తాడు.
***
दैवं पुरुषकारेण यः समर्थः प्रबाधितुम्।
— Narendra Modi (@narendramodi) August 13, 2026
न दैवेन विपन्नार्थः पुरुषः सोऽवसीदति॥ pic.twitter.com/EIKEcyk2Bk