పిఎంఇండియా
గురు పూర్ణిమ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. గురువులు విద్యార్థులకు జ్ఞానాన్ని పంచడంతో పాటు సకారాత్మక శక్తిని, మంచి ఆలోచనల్ని, సంస్కారాల్ని కూడా అందిస్తారని ఆయన అన్నారు. గురువులు బోధించిన ఆదర్శాలను అందరూ తమ జీవితాలకు మార్గదర్శకంగా మలుచుకోవాలని ప్రధానమంత్రి కోరారు.
‘‘ప్రేరకః సూచకశ్చైవ వాచకో దర్శకస్తథా, శిక్షకః బోధకశ్చైవ షడేతే గురవః స్మృతాః’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సరైన దారిని చూపే వారూ, జ్ఞానాన్నీ, సత్యాన్నీ బోధించే వారూ, ధర్మమార్గాన్ని దర్శింపచేసే వారూ, విద్యను అందించడంతో పాటు జీవితంలో సత్యం పట్ల అవగాహనను పెంపొందింప చేసే వారూ, ఆత్మ వికాసానికి బాట వేసే వారూ .. ఇలాంటి వారిని గురువుకు సంబంధించిన ఆరు రూపాలుగా భావిస్తారని ఈ సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ;
‘‘గురు పూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలందరికీ అభినందనలు. గురువు.. జ్ఞానంతో పాటు సకారాత్మక శక్తినీ, మంచి ఆలోచనల్నీ, సంస్కారాల్నీ శిష్యులకు అందిస్తారు. రండి.. గురువుల ఆదర్శాలను మన జీవితానికి ప్రధానాధారంగా మలుచుకుందాం’’ అని పేర్కొన్నారు.
***
गुरु पूर्णिमा की सभी देशवासियों को बहुत-बहुत बधाई। गुरु ज्ञान के साथ ही अपने शिष्यों में सकारात्मक ऊर्जा का संचार कर उन्हें सुविचार और सुसंस्कारों से सुशिक्षित करते हैं। आइए, उनके आदर्शों को अपने जीवन का संबल बनाएं।
— Narendra Modi (@narendramodi) July 29, 2026
प्रेरकः सूचकश्चैव वाचको दर्शकस्तथा।
शिक्षकः बोधकश्चैव षडेते… pic.twitter.com/DejWzLPnda