Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జీవితాన్ని ప్రకాశవంతం చేసి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఎనిమిది గుణాలు.. ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


మనిషి జీవితంలో వెలుగులు నింపిఆ మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఎనిమిది ప్రధాన గుణాలను వివరిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ,

‘‘అష్టౌ గుణాః పురుషం దీపయన్తి ప్రజ్ఞ‌ా సుశీలత్వదమౌ శ్రుతం చపరాక్రమశ్చ బహుభాషితా చ దానం యథాశక్తి కృతజ్ఞ‌తా చ’’ అనే శ్లోకాన్ని పేర్కొన్నారు.

శ్లోకంలో ప్రస్తావించిన ఎనిమిది గుణాలూ వ్యక్తి జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయిఏ వ్యక్తికైనా సరేబుద్ధి సరైన దారిని చూపుతుందిసత్ప్రవర్తన వ్యక్తి శీలాన్ని స్వచ్ఛంగా ఉంచుతుందిఆత్మనిగ్రహం క్రమశిక్షణని అలవరుస్తుందిజ్ఞ‌ానం అవగాహనాశక్తిని అందిస్తుందిపరాక్రమం కఠిన పరిస్థితులు ఎదురైనా దృఢంగా ఉండటంలో తోడ్పడుతుందినేర్పుగా మాట్లాడడం సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందియథాశక్తి దానమివ్వడంకరుణను చూపిన వారి పట్ల కృతజ్ఞ‌తను తెలియజేయడం.. ఇవి మనిషికి పూర్ణత్వాన్ని ఇస్తాయి.

 

***