Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ్ఞానంతో అత్యున్నత లక్ష్యాలను సాధించవచ్చని తెలిపే ఓ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


జ్ఞానం జీవితానికి ఒక గొప్ప పెట్టుబడి అని, దాని సాయంతో మనిషి జీవితంలో ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని చెప్పే  ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. జ్ఞానం మనల్ని అజ్ఞానమనే చీకటి నుంచి బయటకు తీసుకువచ్చి, విజయం, ఆత్మవిశ్వాసం వైపు నడిపిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత సుభాషితం..

 

‘‘విద్వాన్ ప్రశస్యతే లోకే

విద్వాన్ సర్వత్ర గౌరవం।

 

విద్యా లభతే సర్వం

విద్యా సర్వత్ర పూజ్యతే॥’’

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘విద్య జీవితానికి ఒక అద్భుతమైన మూలధనం. దీనితో ఎంతటి గొప్ప లక్ష్యాలనైనా సాధించవచ్చు. విద్య మనల్ని అజ్ఞానమనే చీకటి నుంచి బయటకు తీసుకువచ్చి, విజయపథం వైపు, ఆత్మవిశ్వాసం వైపు నడిపిస్తుంది.

 

‘‘విద్వాన్ ప్రశస్యతే లోకే

విద్వాన్ సర్వత్ర గౌరవం।

 

విద్యా లభతే సర్వం

విద్యా సర్వత్ర పూజ్యతే॥’’