పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ సందర్శన కు బయలుదేరివెళ్లే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.
‘‘వార్షిక శిఖర సమ్మేళనం కోసమని 2018 అక్టోబర్ 28, 29 తేదీ లలో నేను జపాన్ ను సందర్శించనున్నాను. 2014 సెప్టెంబర్ లో నేను ప్రధాన మంత్రి హోదా లో తొలి సారి గా జపాన్ ను సందర్శించినప్పటి నుండి ఇప్పటి వరకు జపాన్ ప్రధాని శ్రీ శింజో ఆబే తో ఇది నా 12వ సమావేశం. ఆ తరువాత 2016 సంవత్సరం లో కూడా వార్షిక శిఖర సమ్మేళనం లో పాల్గొనేందుకు నేను జపాన్ ను సందర్శించాను.
గత ఏడాది నా సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రధాని శ్రీ ఆబే కు, శ్రీమతి అకీ ఆబే కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. భారతదేశానికి జపాన్ ఎంతో విలువైన భాగస్వామి గా ఉంది. ఉభయ దేశాలకు ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం ఉంది. జపాన్ తో మాకు గల ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాలు రెండూ ఇటీవలి కాలం లో పూర్తి గా కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ రోజున ఆ భాగస్వామ్యం ఎంతో ప్రధానమైందిగాను, ప్రయోజనకరమైందిగాను మారింది. భారతదేశం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’, భాగస్వామ్య దృక్కోణం, బహిరంగ మరియు సమ్మిళిత ఇండో- పసిఫిక్ అనే బలమైన పునాదుల మీద నిర్మితమైన బంధం అది.
ప్రజాస్వామ్య దేశాలు గా మాకు ఉమ్మడి విలువలు ఉన్నాయి. అందరికీ శాంతి ని, సుసంపన్నతను మేము కోరుకొంటున్నాం.
మేము చేస్తున్న కృషి భారత, జపాన్ లను విజయవంతమైన కలయిక గా మారుస్తుంది. భారతదేశ ఆర్థిక, సాంకేతిక ఆధునికీకరణ ప్రయత్నాలలో ఈ రోజున జపాన్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి గా ఉంది. భారతదేశం లో అగ్రగామి ఇన్వెస్టర్ లలో ఒకటిగా ఉంది. ముంబయి-అహమదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు మరియు ప్రత్యేకమైన సరకు రవాణా కారిడార్ ప్రాజెక్టు లు మా ఆర్థిక బంధం ఎంత పటిష్ఠమైందో తెలిపే మచ్చుతునక లు. జాతీయ స్థాయి లో మేము చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్టార్ట్- అప్ ఇండియా’ వంటి కార్యక్రమాలలో జపాన్ కూడా ముందు వరుస లో ఉంది.
జపాన్ ఇన్వెస్టర్ లకు అపార అవకాశాలు గల భారతదేశ ఆర్థిక పురోగతి పైన ఎంతో విశ్వాసం ఉంది.
నూతన ఆవిష్కరణ లలోను, సాంకేతిక విజ్ఞానం లోను, అత్యుత్తమ ఆచరణ లోను జపాన్ అంతర్జాతీయ నాయకత్వానికి మేము ఎంతో విలువను ఇస్తాం. జపాన్ కు రోబోటిక్స్ లో గల అత్యున్నత సాంకేతిక సామర్థ్యాలను కూడా ఈ పర్యటన లో నేను చూసే అవకాశం ఉంది.
ప్రధాని శ్రీ శింజో ఆబే తో నేను విస్తృత శ్రేణి లో చర్చలు జరపబోతున్నాను. ఉభయ దేశాల వ్యాపార, పారిశ్రామిక రంగాల ప్రధాన నాయకులతో నేను సమావేశం కానున్నాను. అలాగే భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నాను.
ఈ సంప్రదింపులు, సమావేశాలన్నీ మన వాణిజ్య, పారిశ్రామిక బంధాన్ని మరింత పటిష్ఠం చేయగలుగుతాయి. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ సాంకేతిక విజ్ఞానం, వ్యవసాయం, ఫూడ్ ప్రాసెసింగ్, విపత్తుల ముప్పు నివారణ, విపత్తులకు తట్టుకోగల మౌలిక వసతుల అభివృద్ధి వంటి కొత్త రంగాలకు సహకారం విస్తరించనుంది.
ఉభయ దేశాల పార్లమెంట్ సభ్యుల మధ్యన, మన రాష్ట్రాలకు, జపాన్ లోని వివిధ ప్రాంతాలకు నడుమ పెరుగుతున్నబంధాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఉభయ దేశాల ప్రజల మధ్యన బాంధవ్యం విద్య, నైపుణ్యాల అభివృద్ధి, సంస్కృతి, పర్యటన ల వంటి విభాగాల ద్వారా నిరంతరం విస్తరిస్తూ ఉండడమనేది ఎంతో ఆనందదాయకమైన విషయం.
నా ఈ పర్యటన సాంప్రదాయికంగా, చారిత్రకంగా మన మధ్యన గల ప్రగాఢమైనటువంటి బంధానికి మరింత ప్రోత్సహకరమైన, మరింత మెరుగైన, మరింత సుసంపన్నమైన భవిష్యత్తు కోసం భాగస్వామ్యాన్ని మరింత సుస్థిరం చేసేదిగా నిలవబోతోంది.’’
***
On 28th and 29th October, I would be attending the India-Japan Annual Summit. I look forward to productive talks with PM @AbeShinzo, which will enhance India-Japan ties. Japan is a valued partner, with whom we have a Special Strategic & Global Partnership. https://t.co/J8zFvFNi10
— Narendra Modi (@narendramodi) October 26, 2018
I would interact with business leaders from India as well as Japan. I am eagerly awaiting the interaction with the Indian Community settled there. Stronger business and cultural relations between India and Japan augur well for our people and the world.
— Narendra Modi (@narendramodi) October 26, 2018