Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘టైమ్స్ నౌ’ అమేజింగ్ ఇండియన్స్ అవార్డులు – 2016 ను అందజేసిన ప్రధాన మంత్రి

‘టైమ్స్ నౌ’ అమేజింగ్ ఇండియన్స్ అవార్డులు – 2016 ను అందజేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘టైమ్స్ నౌ’ అమేజింగ్ ఇండియన్స్ అవార్డులు -2016ను అందజేశారు. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి.. గొప్ప విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. అవార్డులు అందుకున్న వారి జీవనయానం వజ్రం వంటిదని పోలిక చెప్పారు; వజ్రాన్ని ప్రపంచం గుర్తించి మెచ్చుకొనే లోపు, అది అనేక శ్రమదమాదులకు లోనవుతుందన్నారు.

భారతదేశంలో అధికారంలో ఉన్న వారి, లేదా డబ్బులున్నవారి గురంచి మాత్రమే ప్రచారం జరుగుతోందంటూ ప్రధాని విచారం వ్యక్తం చేశారు. తీవ్ర ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలచి ఎన్నో సంఘర్షణలకు లోనై సౌజన్యపూర్వక ల‌క్ష్యాల‌ను సాధించిన వారికి గాని, లేదా సమాజానికి సేవ చేసిన వారికి గాని గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు రావడం అరుదుగా జరుగుతోందన్నారు. ఈ వేళ భారత దేశంలో వంద మంది పిల్లలు బాధ్యతాయుత సమాజ సభ్యులుగా మారడానికి వారికి స్ఫూర్తిగా నిలచిన ఒక ఉపాధ్యాయుడికి తరచుగా గుర్తింపు రాకపోవడం, ఆ టీచరును గురించి ఎవరూ చెప్పుకోకపోవడం జరుగుతోందని, ఆయనతో పోలిస్తే ఆయన కన్నా చిన్నవాడైన తక్కువ పనిచేసిన రాజకీయ నాయకుడికి ఎక్కువ గుర్తింపు లభిస్తోందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు, సమాజానికి సేవ చేస్తున్నవారిలో చాలా మంది వ్యక్తిగతంగా కష్టాలను గాని, లేదా క్లిష్ట పరిస్థితులను గాని అధిగమించి సమాజం కోసం పాటు పడ్డవారేనని ప్రధాని అన్నారు. భారత చరిత్ర, పౌరాణికాలను గురించి ప్రధాని ప్రస్తావిస్తూ.. రామాయణం నుంచి మహాభారతం వరకు, సిక్కుల ఐదుగురు గురువులను (పంజ్ ప్యారా లు), ఛత్రపతి శివాజీ సైన్యంలోని మరాఠా యోధులను ఉదాహరించారు. వీరంతా ఎన్నో కష్టాలకోర్చి చరిత్ర సృష్టించారన్నారు.

ఈ రోజు అవార్డులను గెలుచుకున్న వారిని కనుగొని ప్రపంచం ముందు నిలిపిన టైమ్స్ నౌ ను ప్రధాని అభినందించారు. ఈ అవార్డు గ్రహీతలను కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు. వారి విజయాలు మరింత మందికి స్ఫూర్తిని అందజేస్తాయన్నారు.

***