పిఎంఇండియా

కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ యెడియూరప్ప, డిఆర్ డిఒ చైర్ మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డి, డిఆర్ డిఒ కు చెందిన ముఖ్యమైన అధికారులు, ఉన్నత స్థాయి కమిటీ ల సభ్యులు, యువ శాస్త్రవేత్త ల పరిశోధనాలయాల డైరెక్టర్ లు,
మిత్రులారా,
అన్నింటి కన్నా ముందుగా.. మీకు అందరి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది కాకతాళీయం గా జరిగింది.. కొద్ది సేపటి క్రితం తుమ కూరు లో జరిగినటువంటి ఒక రైతు ల కార్యక్రమం లో నేను పాల్గొన్నాను; ఇప్పుడేమో నేను ఇక్కడ మీ అందరి మధ్య- పరిశోధన లో మునిగితేలే దేశ యువ స్నేహితుల మధ్య- ఉన్నాను. మరి రేపటి రోజు న సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమాని కి నేను హాజరు కావలసివున్నది. ఒక విధం గా, నా యొక్క ఈ కర్నాటక సందర్శన, అది కూడాను 2020వ సంవత్సరం లో నా మొదటి పర్యటన ను ‘జయ్ జవాన్, జయ్ కిసాన్, జయ్ విజ్ఞాన్, జయ్ అనుసంధాన్’ యొక్క స్ఫూర్తి కి అంకితం చేయబడింది. అంతే కాదు ఈ కార్యక్రమాన్ని అత్యంత ఆదరణీయులైన డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ డిఆర్ డిఒ లో సన్నిహితం గా మెలగిన ఏరోనాటికల్ డివెలప్ మెంట్ ఎస్టాబ్లిశ్ మెంట్ లో జరపడం మనకు అందరి కి గర్వకారణం అయినటువంటి విషయం కూడాను.
మిత్రులారా,
నూతన భారతదేశ నిర్మాణం కోసం ఈ దశాబ్దం ఎంతో కీలకమైనటువంటిది. ఈ ఏడాది ప్రారంభం నూతన సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు. ఇది నూతన దశాబ్ద ప్రారంభానికి సైతం శ్రీకారం. యరాబోయే సంవత్సరాల్లో భారతదేశం ఎలాంటి శక్తి ని పొందుతుంది? ప్రపంచం లో మన స్థానం ఏమిటో కూడా తెలియజేసే దశాబ్దం ఈ నూతన దశాబ్దం. ఈ దశాబ్దం పూర్తి గా యువత దీ, వారి కలల దీనూ. మన యువ పరిశోధకులు ముఖ్యం గా 21వ శతాబ్దం లో జన్మించిన వారు గాని, ఈ 21వశతాబ్దం లో కౌమార దశ కు చేరుకొన్న వారి దే ఈ దశాబ్దం. పునరాలోచన తో, పునర్నిర్మాణం చేయాలని డిఆర్ డిఒ ను నేను స్వయం గా కోరాను. 21వ శతాబ్దం సవాళ్ల ను ఉరిమే ఉత్సాహం తో అధిగమించాలనే ఆకాంక్ష తో నేను ఆ విధం గా కోరాను. అయితే ఇక్కడ మరొక విషయం.. 36 సంవత్సరాల వయస్సు దాటిన వ్యక్తులు పనికి రారు అనేది నా ఉద్దేశ్యం కాదు. ఇంత కాలం 60, 50, 55.. ఇలా అనేక సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి పని చేసిన వారు 35 సంవత్సరాల వయస్సు కన్న తక్కువ గల యువత నుండి సహాయం తీసుకోవాలని, అప్పుడే నూతన భారతదేశాన్ని చూడగలమని చెప్పడమే నా ఉద్దేశ్యం. ఎంతో అనుభవం ఉన్న పెద్దవారి శక్తియుక్తులు అందుబాటు లో లేకపోతే యువతీయువకులు వారి రంగాల లో ఎదగడం కష్టం. కాబట్టి ఈ ఇద్దరి కలయిక చాలా ముఖ్యం. ఈ ఆలోచన వెనుక నా వ్యక్తిగత అనుభవం ఉంది. నా రాజకీయ జీవితం ఆలస్యం గా ప్రారంభమైంది. మొదట్లో నేను పార్టీ వ్యవహరాల ను చూసే వాడి ని. ఎన్నికల నిర్వహణ లో ఉండే వాడిని. గుజరాత్ లో నా పని ప్రారంభం కావడమే మొదట గా ప్రధాన ఎన్నికల కు సంబంధించి బాధ్యతల ను నిర్వహించడం. ఎన్నికలు నాకు కొత్త. ఈ ఎన్నికల కు సంబంధించిన విషయాల గురించి అప్పట్లో పత్రిక లు వివరం గా వ్రాసేవి. ఆ కాలం లో సుమారు 90 మంది నా కార్యాలయం లో, నా నిర్వహణ లో పని చేసే వారు. రాష్ట్రవ్యాప్తం గా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మా కార్యాలయం లో మాత్రం 90 మంది మాత్రమే పని చేసే వారు. స్వచ్ఛందం గా పని చేయడానికి వచ్చిన వారు రెండు నుంచి మూడు నెలలు మాత్రమే పనిచేయవలసి వుంటుంది. దీనికి సంబంధించి పత్రిక లు వివరం గా వ్రాశాయి. నా జట్టు లోని 90 మంది సరాసరి వయస్సు 23 ఏళ్లు. నేను కూడా ఆ యువ బృందం లో ఒక సభ్యుడి ని. మేమంతా కలసి అనేక కార్యక్రమాల ను నిర్వహించాము. మేము మొదటి సారి గా విజేతలమయ్యాము.
ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొనే సత్తా యువత కు ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఉదాహరణ ను చెబుతాను. మీరు ఒక మంచి కబడ్డీ ఆటగాడు అనుకుందాం. మీ జీవితం లో మీరు 20 సంవత్సరాల పాటు ఈ ఆట ను ఆడి వుంటారు. అంతే కాదు, మీరు జాతీయ స్థాయి లో, అంతర్జాతీయ స్థాయి లో కూడా ఆడి వుంటారు. అయితే మీకు 60, 70 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత కబడ్డీ ఆట ను చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? గతం లో మీరు ఎంత గొప్ప క్రీడాకారుడు అయినప్పటికీ మీకు వయస్సు మీద పడిన తరువాత యువ ఆటగాళ్లు ఆడుతున్న ఆట ను చూసినప్పుడు వారికి గాయాలు అవుతాయేమో అనే భయం వేస్తుంది. మీరు చాలా కాలం కబడ్డీ ఆట ను ఆడారు. దీనికి సంబంధించి అనేక సమస్యల ను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ 18-20 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఎంతో వేగం గా ఈ ఆట ను ఆడుతూ వుంటే చూసినప్పుడు వారి కి దెబ్బ లు తగులుతాయేమో అని భయపడడం జరుగుతుంది. ఒకప్పుడు మీరు అదే పని ని చేశారు. కానీ అదే ఆట ను ఇప్పుడు చూడాలంటే ఆందోళన గా ఉంటుంది. యువత ను, వృద్ధుల ను తీసుకున్నప్పుడు ఇదే మానసిక ఆందోళన ఎదురవుతుంది. యువత కు, బాగా అనుభవం ఉన్న వారి కి ఇదే తేడా. కాబట్టి ఈ నేపథ్యం లో ప్రపంచవ్యాప్తం గా మనకు ఎదురవుతున్న సవాళ్ల ను ఎదుర్కోవడానికిగాను డిఆర్ డిఒ లో అటు యువత ను, ఇటు అనుభవజ్ఞుల ను కలుపుకొని పోవడం ఎలా ?
కొన్ని సార్లు పెద్ద వృక్షం నీడ లో మొక్క లు పెరగలేవు. ఇది పెద్ద వృక్షం తప్పు కాదు. అలాగే మొక్క కూడా అనుకుంటుంది. పెద్ద వృక్షం నీడ లో ఉండడం వల్ల తన కు ఎదుగుదల లేదు అని. ఈ విషయం లో ఎవరినీ తప్పు పట్టనవసరం లేదు. అయితే మొక్క ను తీసుకుపోయి పెద్ద వృక్షం నీడ పడకుండా పెంచితే, అప్పుడు పెద్ద వృక్షం కూడా తన ముందు పెరుగుతున్న మొక్క ను చూసి గర్వపడుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే ఈ ఐదు లేబరేటరీల ను యువ శాస్త్రవేత్తల కోసం ప్రారంభించడం జరిగింది. వీటిలో పని చేసే వారు తప్పులు చేయవచ్చు. అయినా భయపడవలసిన అవసరం లేదు. మొత్తం బడ్జెట్ ఈ ఐదు పరిశోధనాలయాల కోసం ఖర్చయినా ఫర్వాలేదు. ఒక శాస్త్రవేత్త తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసినప్పుడు, అప్పుడు దేశాని కి ప్రయోజనం లభిస్తుంది. మీరు మీ జీవితాన్ని అంకితం చేసి, దేశం కోసం త్యాగం చేస్తున్న దానితో పోలిస్తే నిధుల ఖర్చు అనేది పెద్ద సమస్య కాదు. మీ కోసం నిధులు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుంది ?
ఆధునిక సాంకేతిక రంగం లో ఐదు పరిశోధనాలయాల ను నెలకొల్పాలనే సలహా కార్యరూపం దాల్చి ఈ రోజు న దేశవ్యాప్తం గా ఐదు పరిశోధనాలయాలు నెలకొల్పడం అనేది నాకు ఎంతగానో సంతోషం కలిగిస్తోంది. ఈ పరిశోధనాలయాలు బెంగళూరు, కోల్ కాతా, చెన్నై, హైదరాబాద్, ముంబయి లలో ప్రారంభమవుతున్నాయి. ఈ యువ శాస్త్రవేత్త ల ఆలోచనలు, అభిప్రాయాల కు ఈ పరిశోధనాలయాలు కొత్త రెక్కలను తొడుగుతాయని నేను నమ్ముతున్నాను. యువ శాస్త్రవేత్తల పరిశోధనాలయాలు కాబట్టి వీటిని డిఆర్ డిఒ- వై అని గుర్తించాము. అయితే వీటి పేరు ను ఉచ్ఛరించినప్పుడు ఇవి డిఆర్ డిఒ- వై (ఎందుకు) అన్నట్టు గా వినిపిస్తుంది. అలా ఎందుకు అనే ప్రశ్నల కు ఈ ఐదు ల్యాబు లు సమాధానం ఇస్తాయని నమ్ముతున్నాను. మనందరం కలసి వీటి ని బలోపేతం చేద్దాము. ఈ పరిశోధనాలయాలు అందించే ఫలితాలు అనేవి ఆధునిక సాంకేతికత ల కోసం మన దేశం చూపుతున్న ఆకాంక్షల కు నిదర్శనం గా నిలుస్తాయి. దేశం లో ఆధునిక సాంకేతికత ల రంగం లో జరిగే పరిశోధన, అభివృద్ధి స్వభావం అనేది రూపొందడానికి ఈ ఐదు పరిశోధనాలయాలు దోహదం చేస్తాయి.
నా యువ శాస్త్రవేత్తలారా, మీకు ఈ సందర్భం లో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ పరిశోధనాలయాలు కేవలం సాంకేతికతల ను పరీక్షించవు. కొన్ని సార్లు మనం అనుకుంటాం సాంకేతికత అనేది మూడు లేదా ఐదు అంచెల వరకు ఆధునికం గా ఉంది అని. ఇది సాంకేతికత ను గురించి మాత్రమే కాదు. ఈ పరిశోధనాలయాలు నా యువ శాస్త్రవేత్త ల ఆలోచనల ను, ఓపిక ను పరీక్షిస్తాయి. ఇది అత్యంత గొప్పదైన పరామితి.
మీరు నిత్యం చేసే కృషి, స్థిరం గా చేసే పరిశోధనల కారణం గా దేశం విజయాల బాట లో నడుస్తుందనే విషయాన్ని మీరు ఏనాడూ మరచిపోకూడదు. సానుకూల దృక్పథం తో, లక్ష్యం మాత్రమే మీకు స్ఫూర్తి ని అందించాలి. దీని ని నిత్యం మీ మనస్సు లో ఉంచుకోవాలి. 130 కోట్ల మంది భారతీయుల జీవితాల ను సౌకర్యవంతం గా, భద్రం గా ఉంచడం అనే ఒక బృహత్తర బాధ్యత మీ మీద ఉన్నదనే సంగతి ని మరచిపోవద్దు.
మిత్రులారా,
ఈ రోజు న కార్యక్రమం కేవలం ప్రారంభం. మీ ముందు ఒక ఏడాది మాత్రమే కాదు. మొత్తం ఒక దశాబ్దమే ఉంది. ఈ దశాబ్దం లో డిఆర్ డిఒ తయారు చేసుకునే మధ్యకాల, దీర్ఘకాల ప్రణాళిక లకు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. మీకు మరొక సలహా ను ఇవ్వాలని అనుకుంటున్నాను. 35 ఏళ్లు, అంతకన్న తక్కువ వయస్సు గల యువ శాస్త్రవేత్తలు ఈ ఐదు పరిశోధనాలయాల్లో పని చేస్తున్నారు. అయితే ఈ బృందాని కి 36 ఏళ్లు వస్తే అప్పుడు ఏమవుతుంది ? అయితే ఇక్కడ నేను ఒక హామీ ని ఇస్తున్నాను. ఈ ఐదు పరిశోధనాలయాల్లో పని చేసేవారి వయస్సు పరిమితి 40 లేదా 55 లేదా అంతకంటే ఎక్కువకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది.అయితే మీరు 35 ఏళ్ల యువశాస్త్రవేత్తలతో నిండి వుండే మరో ఐదు పరిశోధనాలయాలను నెలకొల్పడానికి కృషి చేయాలి. మీరు 35 ఏళ్ల పరిమితి ని కొనసాగించవలసిన అవసరం లేదు. ఈ పరిశోధనాలయంలోని వారి వయస్సు 40, 45 ఏళ్లు దాటినా ఫర్వాలేదు. అయితే 35 ఏళ్ల వయస్సు గల శాస్త్రవేత్తల తో కూడిన మరో ఐదు నూతన పరిశోధనాలయాలు మనకు లభిస్తాయి. వారి కి కూడా 35 దాటితే మనకు మరో ఐదు నూతన పరిశోధనాలయాలు వస్తాయి. ఈ పరంపర ఇలా కొనసాగుతుంది.
ఈ పరంపర కొనసాగకపోతే మూడేళ్ల తరువాత తన భవిష్యత్తు ఏమిటని ఇక్కడ పని చేస్తున్న 32 సంవత్సరాల యవస్సు గల శాస్త్రవేత్త ఆందోళన చెందుతాడు. అప్పుడు వారి కలలు ఛిద్రం అవుతాయి. కాబట్టి ఈ పరిశోధనాలయాల బాధ్యత ను వారు పదవీవిరమణ చేసేటంత వరకు వారికే వదలివేయడం జరుగుతుంది. వీరి కి 50, 55, 60 ఏళ్లు వచ్చేంత వరకు పని చేయడానికి వీలు గా అనుమతి ఉంటుంది. అయితే వీరు 35 ఏళ్ల లోపు శాస్త్రవేత్తల తో కూడిన ఐదు నూతన పరిశోధనాలయాల ను రూపొందించేలా వీరికి సాయం చేయాలి. ఈ పరంపర తప్పకుండా ముందుకు సాగాలి. తద్వారా నూతన తరాని కి చెందిన శాస్త్రవేత్తల వాతావరణం నిత్యం మన ముందు ఉంటుంది. యువ శాస్త్రవేత్తల పరిశోధనాలయాలు నిత్యం పని చేయడం వల్ల అంతిమం గా దేశాని కి లబ్ధి చేకూరుతుంది. ఈ ఆలోచన వరకు మాత్రమే మనం ఆగిపోకూడదు. ఒక కాలపరిమితి ని పెట్టుకొని ఆ లోపు కార్యాచరణ మొదలు అయ్యేలా ఈ కార్యక్రమం ఉండాలి.
ఆకాశం అంత ఎత్తు కు డిఆర్ డిఒ ఎదగాలని నేను కోరుకుంటున్నాను. దేశం లోని శాస్త్ర సాంకేతిక సంస్థల కు ఒక నూతన మార్గాన్ని చూపే సంస్థ గా మాత్రమే కాకుండా ప్రపంచ శాస్త్ర సాంకేతిక సంస్థల కు కూడా ఆదర్శం గా నిలచేలా తయారు కావాలి. దీని పై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. డిఆర్ డిఒ గాని, ఈ యువ పరిశోధనాలయాలు గాని ప్రపంచాని కి స్ఫూర్తి ని అందించాలి. ఈ ఆకాంక్ష వెనక బలమైన కారణం ఉంది. అందుకే నేను దీనిని వ్యక్తపరుస్తున్నాను. డిఆర్ డిఒ చరిత్ర గాని, దాని సామర్థ్యం గాని, దాని పై దేశం పెట్టుకున్న నమ్మకం గాని చాలా గొప్ప వి.
మిత్రులారా,
దేశం లోని ఉత్తమ శాస్త్రవేత్తలు డిఆర్ డిఒ లో వున్నారు. డిఆర్ డిఒ ఎన్నెన్నో విజయాల ను సాధించింది. మీరు ఏర్పాటు చేసిన ప్రదర్శన ను ఇప్పుడే చూశాను. దానిలో మీరు ఈ మధ్య సాధించిన విజయాల వివరాలే కాదు మీ భావి ప్రణాళిక లు, ప్రాజెక్టు ల వివరాలు కూడా చూశాను. యువ శాస్త్రవేత్తలు చాల సులువైన భాష లో నాకు బోధపడేలా ఈ ప్రదర్శన ను గురించి వివరించడం జరిగింది. ఆ పని ని నేను కూడా చేయగలను అనిపించేలా వారు వివరించారు. నా విద్యార్థి దశ లో పాఠశాల లో నాకు ఈ విషయాలు అర్థం అయ్యేవి కావు. ఈ రోజు న మీరు శాస్త్ర సాంకేతిక విషయాల ను చాలా చక్క గా వివరించారు. ఈ రోజు న మీరు భారతదేశ క్షిపణి కార్యక్రమాన్ని ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ కార్యక్రమం గా రూపొందించారు. గత ఏడాది అంతరిక్ష మరియు గగన రక్షణ వ్యవస్థ రంగం లో భారతదేశ సామర్థ్యం అనేది నూతన మార్గాన్ని రూపొందించుకుంది. ఎఎస్ ఎటి రూపం లో దేశంలోనే తయారైన సాంకేతికత ను విజయవంతం గా పరీక్షించడం జరిగింది. ఇది 21వ శతాబ్దపు భారతదేశ సామర్థ్యాన్ని తప్పకుండా చాటే కార్యక్రమం.
మీరు చేసిన కృషి కారణం గా విమానాల నుండి వాటి ని రవాణా చేసే వాహనాల వరకు తయారు చేయగలిగే దేశాల సరసన భారతదేశం నిలచింది. అయితే అది మాత్రమే సరిపోతుందా ? ఎంతమాత్రమూ కాదు.
స్నేహితులారా, మీరు ఇళ్ల లో చూసే వుంటారు.. పిల్లలు ఒక మంచి పని ని చేసినప్పుడు వారు మరిన్ని మంచి పనులను చేయాలి అంటూ తల్లిదండ్రులు కోరుతుంటారు. తల్లిదండ్రుల కోరిక మేరకు పిల్లలు ఐదు మంచి పనులు చేస్తే, అప్పుడు తల్లిదండ్రులు ఏడు మంచిపనులు చేయాలని అడుగుతారు. పిల్లలు ఏడు పనులు పూర్తి చేస్తే, తల్లిదండ్రులు పది పనులు చేయాలని అడుగుతారు. అయితే అదే కాలం లో ఎవరైనా ఏమీ చేయకపోతే, అప్పుడు ప్రతి ఒక్కరూ వాడి ని వదిలేయండి, వాడు చేయలేడు అని అంటారు. కాబట్టి పని చేసే వారికే పనులు లభిస్తుంటాయి.
‘రామచరిత మానస్’ను చూడండి అందులో ఒక గొప్ప నానుడి ఉంది. అది చెబుతుంది..
कवन जो काम कठिन जग माहीं।
जो नहिं होइ तात तुम्ह पाहीं।। అని.
ఈ మాటల కు అర్థం, నీవు చేయలేని పని అంటూ ఏదైనా ఈ భూమి మీద ఉందా ? నీవు ఏ పనిని అయినా చేయగలవు. నీకు ఏదీ కష్టం కాదు. రామచరిత్ మానస్ ను వ్రాసినప్పుడు ఎవరైనా అనుకున్నారా ? భవిష్యత్తు లో డిఆర్ డిఒ ఏర్పడుతుంది అని. ఈ వాక్యాలు డిఆర్ డిఒ కు వర్తిస్తాయి అని నేను భావిస్తున్నాను. మీ సామర్థ్యాల కు పరిమితులు లేవు. మీరు ఎంతైనా సాధించగలరు. మీ ముందు ఉన్నటువంటి అవకాశాల ను విస్తరించండి. మీ సామర్థ్య పరామితుల ను మార్చండి. మీ రెక్కల ను పూర్తి స్థాయి లో ఉపయోగించండి. గగన తలాన్ని పాలించగలిగే ధైర్యాన్ని చూపండి. మీ ముందు అవకాశాలు ఉన్నాయి. మీకు అండ గా నేను ఉన్నాను.
శాస్త్రవేత్త లు మరియు దేశ నూతన ఆవిష్కర్తలైన మీ సమక్షం లో దేశ ప్రధాన మంత్రి గా నేను నిలబడి, మీతో కలసినడవటానికి భారతదేశం సిద్ధం గా ఉందని స్పష్టం చేస్తున్నాను. భవిష్య కాలం లో సముద్రం మరియు గగనతలం.. ఈ రెంటి తో పాటు సైబర్ మరియు అంతరిక్షం సైతం ప్రపంచ వ్యూహాత్మక గతిశీలత ను నిర్ణయిస్తాయన్న సంగతి ని మీరు బహు బాగా ఎరుగుదురు. అంతేకాదు, తెలివైన యంత్రాలు రానున్న కాలం లో రక్షణ యంత్రాంగం లోను, భద్రత యంత్రాంగంలోను ఒక ముఖ్య పాత్ర ను పోషించే సత్తా ను కలిగి ఉన్నాయి. అటువంటి పరిస్థితి లో భారతదేశం ఏ దేశం కన్నా కూడాను వెనుకబడి ఉండజాలదు. భారతదేశం యొక్క పౌరుల ను, సరిహద్దుల ను మరియు ప్రయోజనాల ను కాపాడుకోవడాని కి భవిష్యత్తు సాంకేతిక విజ్ఞానంలో పెట్టుబడి కి తోడు నూతన ఆవిష్కరణలు కూడా అవసరమే.
‘న్యూ ఇండియా’ యొక్క ఆవశ్యకత లను మరియు ఆకాంక్షల ను నెరవేర్చడం లో మీరు శక్తివంచన లేకుండా తప్పక కృషి చేస్తారని నాకు తెలుసును. మీ యొక్క విస్తృతి ఒక్క భారతదేశాని కి పరిమితం కాకూడదు అని కూడా నేను అంటాను. డిఆర్‌డిఒ వంటి ఒక సంస్థ ప్రపంచం లో మానవ జాతి కి ఇవ్వగలిగింది ఎంతో ఉంది. ప్రపంచ భద్రత దిశ గా మీరు ఒక కీలకమైన పాత్ర ను పోషించగలరు. ప్రస్తుతం సరిహద్దుల లో దాడుల ముప్పు లేనటువంటి దేశాలు అనేకం ఉన్నాయి. ఇరుగు పొరుగు లలో అన్నీ మిత్ర దేశాలే ఉన్నాయి. ఈ దేశాల కు సైతం వాటి పొరుగు న ఎటువంటి యుద్ధ భయం ఎన్నడూ ఎదురు కాలేదు కాబట్టి తాము తుపాకుల ను ఉపయోగించవలసిన అగత్యం ఉంటుందని ఏనాడూ అనుకోనివి సైతం ప్రస్తుతం ఉగ్రవాదం బారిన పడి, గాయపడుతున్నాయి. సరిహద్దు లు సురక్షితం గా, ప్రశాంతం గా, తలుపులను తెరచి ఉంచినవై, పూర్తి ప్రేమ తో నిండి ఉన్నప్పటి కీ అటువంటి దేశాలు కూడా ఉగ్రవాదం వల్ల దెబ్బతిన్నాయి. దీని తో ఆ దేశాలు తుపాకుల ను చేతపట్టుకోవలసి వచ్చింది.
అటువంటి దేశాల లో ఆంతరంగిక భద్రత ను మెరుగు పరచడానికి కూడా డిఆర్‌డిఒ తన తోడ్పాటు ను అందించవచ్చు. నేను భేటీ అయ్యే చిన్న దేశాల ప్రజల అవసరాలు చాలా వరకు పెరిగాయి. పరిమిత వనరుల కు అదనం గా వారు ఈ బెదరింపులను అణచివేసేందుకు క్రొత్త గా మరి దేనినో ఆలోచించక తప్పని పరిస్థితి. మనం వారి చేతుల ను మన చేతుల తో పట్టుకొని వారి కి భద్రత తాలూకు పూచీ ని ఇవ్వవచ్చును. ఇది మానవీయత తో కూడిన కార్యం అవుతుంది. మరి మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పని మానవాళి కి గొప్ప సేవ కాగలదు. అంతేకాక ప్రపంచ రంగ స్థలంలో భారతదేశం యొక్క పాత్ర ను బలోపేతం కూడా చేయగలదు.
మిత్రులారా, రక్షణ సంబంధిత తయారీ రంగం లో భారతదేశాన్ని స్వావలంబన కలిగింది గా తీర్చిదిద్దడం కోసం డిఆర్‌డిఒ సరిక్రొత్త ఆవిష్కరణల తో ముందంజ వేయవలసి వుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ను పటిష్ట పరచడంలో మరియు దేశం లో ఒక హుషారైన రక్షణ రంగాన్ని ప్రోత్సహించడం లో డిఆర్‌డిఒ యొక్క నూతన ఆవిష్కరణ లు ఒక బృహత్తరమైనటువంటి భూమిక ను పోషిస్తాయి. మరి ఈ కారణం గా ఆకృతి మొదలుకొని అభివృద్ధి దశ వరకు మనం సంపూర్ణ స్వావలంబన కలిగిన స్థితి కి చేరుకోవడం కోసం అదే పని గా కృషి చేస్తూ సాగాలి. ఏకీకరణ పైన, నూతన ఆవిష్కరణపైన తదేక దృష్టి కలిగిన ఒక వ్యవస్థ ను మనం అభివృద్ధి పరచవలసి ఉంది.
మిత్రులారా, ప్రస్తుతం, భారతదేశం రక్షణరంగం లో నూతన సంస్కరణ ల దిశ గా శరవేగం గా సాగిపోతోంది. ప్రపంచం లో పరిస్థితులు శీఘ్ర గతి న మారిపోతున్నాయి. మరి సాంకేతిక విజ్ఞానం స్థితిగతుల పైన పైచేయి ని ప్రదర్శించడాన్ని కొనసాగిస్తూనే ఉంది. అటువంటప్పుడు భారతదేశం కేవలం పాత వ్యవస్థలపై ఆధారపడజాలదు. 19వ శతాబ్ది కిచెందిన వ్యవస్థ లతో మనం 21వ శతాబ్ది ని ఎదుర్కొనలేము. ఈ వారం లోనే ప్రభుత్వం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను కూడా నియమించడమైంది. ఈ సిడిఎస్ భారీ మార్పు ను తీసుకు రానున్నారు. ఆయన కు డిఆర్‌డిఒ తో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. మెరుగైన సమన్వయం, సంధానం మరియు సహకారం కోసం ఆ తరహా ఏర్పాటు ఎంతయినా అవసరమని కొన్ని సంవత్సరాల క్రితమే భావించడమైంది. ఈ పదవి దేశాని కి మా ప్రభుత్వం యొక్క వాగ్ధానం. ఈ వాగ్ధానాన్ని మేము నెరవేర్చాము.
మిత్రులారా, మారుతున్నటువంటి ఈ దశ కు అనుగుణం గా మనల ను మనం నిరంతరం బలపరచుకొంటూ ఉండక తప్పదు. మా వద్ద నుండి దేశం అపేక్షిస్తున్నది ఇదే. మరి ఇది యంగ్ సైంటిస్ట్ స్ ల్యాబ్స్ యొక్క స్థాపన వెనుక ఉన్నటువంటి దార్శనికత కూడా. ఇవాళ మనం భావి సాంకేతిక సవాళ్ళ ను మాత్రమే ఎదుర్కోవడం లేదు. మనం డిఆర్‌డిఒ యొక్క శ్రమ సంస్కృతి లో నూతన శక్తి ని కూడా ప్రవేశపెడుతున్నాము. ఈ అపేక్ష తో నేను మీ అందిరి కీ మరొక్క మారు శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.
మీకు మరియు మీ కుటుంబ సభ్యుల కు మరొక్కమారు నూతవసంవత్సరం సంతోషాన్ని ప్రసాదించుగాక.
అనేకానేక ధన్యవాదాలు.
**
Furthering innovation among youngsters.
— Narendra Modi (@narendramodi) January 2, 2020
In Bengaluru, I had the honour of dedicating to the nation five labs for our young scientists.
Located in different parts of India, these labs will have a very positive impact as far as improving research in science is concerned. pic.twitter.com/HfzqRyRTSr
DRDO has many bright minds associated with it.
— Narendra Modi (@narendramodi) January 2, 2020
An organisation like DRDO can make rich contributions to the global security apparatus. pic.twitter.com/yc6THka7JY
ये भी हम सबके लिए बहुत गौरव का विषय है कि ये आयोजन Aeronautical Development Establishment में हो रहा है, जहां हम सभी के श्रद्धेय डॉ. ए पी जे अब्दुल कलाम DRDO से जुड़े थे: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
मुझे संतोष है कि AdvancedTechnologies के क्षेत्र में 5 Labs स्थापित करने के सुझाव पर गंभीरता से काम हुआ और आज बेंगलुरु, कोलकाता, चेन्नई, हैदराबाद और मुंबई में 5 ऐसे संस्थान शुरु हो रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
ये Labs, देश में उभरती हुई Technologies के क्षेत्र में, Research और Development के स्वरूप को तैयार करने में मदद करेंगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
अपने युवा वैज्ञानिक साथियों से मैं ये भी कहूंगा कि ये Labs, सिर्फ टेक्नॉलॉजी को टेस्ट नहीं करेंगी, आपके टेंपरामेंट और पेशेंस को भी टेस्ट करने वाली हैं। आपको हमेशा ये ध्यान रखना होगा कि आपके प्रयास और निरंतर अभ्यास ही हमें सफलता के रास्ते पर ले जाएंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
आज का ये कार्यक्रम तो एक शुरुआत भर है।
— PMO India (@PMOIndia) January 2, 2020
आपके सामने सिर्फ अगला एक साल नहीं, अगला एक दशक है।
इस एक दशक में DRDO का मीडियम और लॉन्ग टर्म रोडमैप क्या हो, इस पर बहुत गंभीरता से विचार किया जाना चाहिए: PM @narendramodi
मैं DRDO को उस ऊँचाई पर देखना चाहता हूं जहां वो न सिर्फ भारत के वैज्ञानिकसंस्थानों की दिशा और दशा तय करे, बल्कि दुनिया के अन्य बड़े संस्थानों के लिए भी प्रेरणास्रोत बनें: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
आपने भारत के मिसाइल कार्यक्रम को दुनिया के सबसे उत्कृष्ट कार्यक्रमों में शामिल किया है। बीता वर्ष तो स्पेस और एयर डिफेंस के क्षेत्र में भारत के सामर्थ्य को नई दिशा देने वाला रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
देश के प्रधानमंत्री के नाते मैं आपके सामने खड़ा होकर कह रहा हूं कि सरकार पूरी तरह आपके साथ, देश के वैज्ञानिकों के साथ, innovators के साथ कंधे से कंधे मिलाकर चलने के लिए तत्पर है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
भारत किसी से भी पीछे नहीं रह सकता। अपने नागरिकों, अपनी सीमाओं और अपने हितों की रक्षा के लिए भविष्य की तकनीक पर Investment भी ज़रूरी है और Innovation भी आवश्यक है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
Defence Manufacturing के क्षेत्र में, भारत को आत्मनिर्भर बनाने के लिए DRDO को नए Innovations के साथ सामने आना होगा।
— PMO India (@PMOIndia) January 2, 2020
देश में एक Vibrant Defense Sector को बढ़ावा देने में, मेक इन इंडिया को मजबूत करने में DRDO के Innovations की बहुत बड़ी भूमिका है: PM @narendramodi