పిఎంఇండియా
మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న మెస్సర్స్ జే ఎస్ డబ్ల్యూ జయ్ గఢ్ పోర్ట్ లిమిటెడ్ (జే ఎస్ డబ్ల్యూ – జేపీఎల్) భూమిని తీసుకొని అందుకు బదులుగా డైరెక్టరేట జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్ (డి.జి.ఎల్.ఎల్) కు చెందిన స్థలాలను మార్పిడి చేసుకొనే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదించింది. ఈ సమావేశానికి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. ఆయా స్థలాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా సంబంధిత ఇరు పక్షాలకు ఈ భూమార్పిడి వీలు కల్పిస్తుంది. ఇందులో భాగంగా డీ.జీ.ఎల్.ఎల్ 0.7630 హెక్టార్ల విస్తీర్ణం ఉండే 12కు పైగా స్థలాలను అప్పగించి ఒక హెక్టారుకు సమానమైన మూడు స్థలాలను తాను స్వీకరిస్తుంది.
నేపథ్యం
డీ.జీ.ఎల్.ఎల్ భూములు పోర్టు స్టోరేజీ ఏరియాలో అక్కడక్కడ విస్తరించి ఉండటంతో జే ఎస్ డబ్ల్యూ – జేపీఎల్ తన కార్యకలాపాలను నిర్వహించుకోవడంలో పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇది కస్టమ్స్ కు కూడా సమస్యలు సృష్టిస్తోంది. ద ఇంటర్నేషనల్ షిప్ అండ్ పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ (ఐ.ఎస్.పి.ఎస్)ను అమలుచేయడంలో పోర్టుకు కూడా ఇబ్బంది ఎదురవుతోంది. అంతేకుండా డీ.జీ.ఎల్.ఎల్ కూడా తన లైట్ హౌస్ కార్యకలాపాల విస్తరణ చేపట్టడం కష్టమవుతోంది. ప్రతిపాదిత భూ మార్పిడి ఇటుజే ఎస్ డబ్ల్యూ – జేపీఎల్ కు, అటు డీ.జీ.ఎల్.ఎల్ కు ఇద్దరికీ ప్రయోజనకరమే కానుంది.