Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డ‌బ్లిన్ – ఐర్లాండ్‌లో ప్ర‌ధాన మంత్రి కార్య‌క్ర‌మాలు

డ‌బ్లిన్ – ఐర్లాండ్‌లో  ప్ర‌ధాన మంత్రి  కార్య‌క్ర‌మాలు

డ‌బ్లిన్ – ఐర్లాండ్‌లో  ప్ర‌ధాన మంత్రి  కార్య‌క్ర‌మాలు

డ‌బ్లిన్ – ఐర్లాండ్‌లో  ప్ర‌ధాన మంత్రి  కార్య‌క్ర‌మాలు

డ‌బ్లిన్ – ఐర్లాండ్‌లో  ప్ర‌ధాన మంత్రి  కార్య‌క్ర‌మాలు

డ‌బ్లిన్ – ఐర్లాండ్‌లో  ప్ర‌ధాన మంత్రి  కార్య‌క్ర‌మాలు

డ‌బ్లిన్ – ఐర్లాండ్‌లో  ప్ర‌ధాన మంత్రి  కార్య‌క్ర‌మాలు

డ‌బ్లిన్ – ఐర్లాండ్‌లో  ప్ర‌ధాన మంత్రి  కార్య‌క్ర‌మాలు


సెప్టెంబ‌ర్ 23వ తేదీన భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఐర్లాండ్‌ను సంద‌ర్శించి ఆ దేశ ప్ర‌ధాని శ్రీ ఎండా కెన్నీతో ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌రిపారు. శ్రీ న‌రేంద్ర మోదీకి డ‌బ్లిన్ విమానాశ్ర‌యంలో ఐరిష్ ఆరోగ్య శాఖ మంత్రి లియో వ‌ర‌డ్క‌ర్ ముందుగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం డ‌బ్లిన్‌లోని ప్ర‌భుత్వ భ‌వ‌న స‌ముదాయం వ‌ద్ద ఐర్లాండ్ ప్ర‌ధాని ఎండా కెన్నీ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కి సాద‌ర‌పూర్వ‌క స్వాగ‌తం ప‌లికారు. భార‌త దేశానికి విశిష్ట సేవ‌లు అందించిన ఇద్ద‌రు ఐర్లాండ్ అధికారులు – థామ‌స్ ఓల్డ్‌హామ్ , స‌ర్ జార్జి అబ్ర‌హాం గ్రెయిర్‌స‌న్‌కు సంబంధించిన చారిత్ర‌క లిఖిత ప్ర‌తుల న‌క‌లు కాపీల‌ను, వారికి చెందిన ఇత‌ర ప‌త్రాల‌ను ఐర్లాండ్ ప్ర‌ధాన మంత్రికి శ్రీ న‌రేంద్ర మోదీ అంద‌జేశారు. ఐర్లాండ్ ప్ర‌ధాని ఎండా కెన్నీ శ్రీ న‌రేంద్ర మోదీకి ఒక క్రికెట్ జెర్సీని, ఐర్లాండ్‌లో ప్ర‌సిద్ధి గాంచిన ` హ‌ర్లింగ్ ` ఆట సామాగ్రి కిట్ ను బ‌హుక‌రించారు..ఐరిష్ ప్ర‌ధాని కార్యాల‌యంలోని విజిట‌ర్స్ బుక్‌లో శ్రీ మోదీ సంత‌కం చేశారు. ఇరువురు ప్ర‌ధాన మంత్రులు మ‌ధ్యాహ్న భోజ‌న స‌మ‌యంలో స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపారు.. సుమారు 60 ఏళ్ల త‌ర్వాత భార‌త ప్ర‌ధాన మంత్రి ఐర్లాండ్‌ను సంద‌ర్శిస్తున్నార‌ని ఉభ‌య దేశాల నేత‌లు త‌మ ప్రారంభోప‌న్యాస వ్యాఖ్య‌ల‌లో ప్ర‌స్తావించారు. భార‌త్‌- ఐర్లాండ్ దేశాల మ‌ధ్య ప‌లు విష‌యాల‌లో సామీప్య‌త ఉంద‌ని శ్రీ మోదీ పేరొ్న్నారు..భార‌త్ – ఐర్లాండ్ దేశాల మ‌ధ్య స‌న్నిహిత భాగ‌స్వామ్యం, స‌హ‌కారానికి మ‌రింత ప్రాముఖ్య‌త ఇవ్వ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉందని ప్ర‌ధాని పేర్కొన్నారు. ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదంతో పాటు అంత‌ర్జాతీయ స‌వాళ్లు, యూర‌ప్‌- ఆసియాలో ప‌రిస్థితుల‌పై రెండు దేశాల ప్ర‌ధాన మంత్రులు విస్తృత స్థాయిలో అభిప్రాయాల‌నుపంచుకున్నారు. ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌త మండ‌లిలో భార‌త్ కు శాశ్వ‌త స‌భ్య‌త్వం క‌ల్పించ‌డానికి, నిర్ణీత వ్య‌వ‌ధిలో సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చేందుకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని శ్రీ మోదీ ఐర్లాండ్ ప్ర‌ధానిని కోరారు. అణు స‌ర‌ఫ‌రాదారుల బృందం ( ఎన్ఎస్‌జీ) ఇత‌ర అంత‌ర్జాతీయ ఎగుమ‌తి విధానాల‌లోను భార‌త్‌కు స‌భ్య‌త్వం ఇవ్వాల‌ని కూడా శ్రీ న‌రేంద్ర మోదీ ఐర్లాండ్ ను అభ్య‌ర్ఙించారు.

అనంత‌రం ఐర్లాండ్‌లోని భార‌తీయుల‌ను ఉద్దేశించి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. సంస్కృత‌ భాష ను బోధించే స్థానిక జాన్ స్కోట‌స్ స్కూల్‌ కు చెందిన 20 మంది విద్యార్ధులు ఈ సంద‌ర్భంగా సంస్కృత శ్లోకాలు వ‌ల్లిస్తూ ప్ర‌ధాని మోదీకి స్వాగ‌తం ప‌లికారు. దీనికి భార‌త ప్ర‌ధాని ముగ్ధుడ‌య్యారు. విద్యార్ధుల‌కు శ్లోకాల‌ను నేర్పిన ఉపాధ్యాయుల‌ను అభినందిస్తూ, సంస్కృత శ్లోకాల‌ను భావ‌యుక్తంగా వ‌ల్లించార‌ని విద్యార్ధుల‌ను ప్ర‌శంసించారు. భార‌త‌-ఐర్లాండ్ దేశాల మ‌ధ్య దీర్ఘ‌కాలంగా కొన‌సాగుతూ వ‌స్తున్న సాంప్ర‌దాయాలు, విలువ‌ల గురించి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌స్తావించారు. త‌మ రెండు దేశాలు స్వాతంత్రం కోసం పోరాడాయ‌ని గుర్తు చేస్తూ, 2016 లో జ‌ర‌గ‌నున్న ఐర్లాండ్ స్వాతంత్ర పోరాట శ‌తాబ్ది వేడుక‌ల‌లో భార‌త్ కూడా పాల్గొంటుంద‌ని చెప్పారు. భార‌త్‌లో శీఘ్ర‌గ‌తిన జ‌రుగుతున్న మార్పుల గురించి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌స్తావించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల‌లో భార‌త్ ఒక‌ట‌ని, ` బ్రిక్స్ ` దేశాల‌లో శ‌క్తిమంత‌మైన దేశంగా భార‌త్ రూపుదిద్దుకుంటున్న‌ద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.