Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢాకాలో దాడి కారణ౦గా ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రా౦తి వ్యక్తం చేసిన ప్రధాని ఘటన


ఢాకా లో దాడి కారణ౦గా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాన మ౦త్రి శ్రీ నరే౦ద్ర మోదీ దిగ్భ్రా౦తి వ్యక్తం చేసారు.

ఈ దాడి ఘటన తనకు చాలా బాధ కలిగించిందన్నారు. దుర్ఘటన జరిగిన తీరుపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను అడిగి తెలుసుకున్నానని వెల్లడించారు. ఇదొక తుచ్చమైన దాడి అని ప్రధాని అన్నారు.

బంగ్లాదేశ్ సోదర, సోదరీమణులకు ఈ విచారకర సమయ౦లో భారతదేశం అ౦డగా నిలుస్తుందన్నారు.

ఈ దాడి ఘటనలో నష్టపోయిన‌ కుటు౦బాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి, నా ప్రార్థనలు వారితో ఉన్నాయి. అని ప్రధాన మ౦త్రి అన్నారు.