Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీ.. మాలవీయ నగర్‌లో అగ్ని ప్రమాదం.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


ఢిల్లీ.. మాలవీయ నగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారుఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలిపారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. బాధితులకు అన్ని విధాలా సాయాన్ని అధికారులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్నుంచి రూ.2 లక్షల వంతునగాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందించనున్నట్లు ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి:
‘‘
ఢిల్లీ.. మాలవీయ నగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించడం బాధాకరంఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానుబాధితులకు అన్ని విధాలా సాయాన్ని అధికారులు అందిస్తున్నారు.
మృతుల కుటుంబాలకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలుగాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’ అని పేర్కొన్నారు.

 

***