Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీ- మీర‌ట్ ఎక్స్ ప్రెస్ వే శంకుస్థాప‌న ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఢిల్లీ-మీర‌ట్‌ ఎక్స్ ప్రెస్ వే కు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మ ఫ‌ల‌కాన్నిఈ రోజు నోయిడాలోని సెక్ట‌ర్‌-62 వ‌ద్ద ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగిస్తూ, బ్రిటిష్ పాల‌న నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటూ 1857లో జ‌రిగిన తిరుగుబాటులో మీర‌ట్ పోషించిన‌ పాత్ర‌ను గుర్తు చేశారు. ఢిల్లీ-మీర‌ట్ ఎక్స్ ప్రెస్ వే కాలుష్యం బారి నుంచి స్వాతంత్ర్యం ప్ర‌సాదిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌గ‌తి పైన దేశ ప్ర‌జ‌లు ఆశ‌లు పెట్టుకొన్నార‌ని ప్ర‌ధాని గుర్తు చేస్తూ, అభివృద్ధికి బాట‌లు వేసే తొలి ముంద‌స్తు అవ‌స‌రాల‌లో చ‌క్క‌ని ర‌హ‌దారి మార్గాలు ఒక‌ట‌ని చెప్పారు. ఈ ఎక్స్ ప్రెస్ వే ప‌శ్చిమ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో వికాసానికి ఊతం అందిస్తుంద‌న్నారు. భార‌తదేశానికి స్వ‌ర్ణ చ‌తుర్భుజి ప‌థ‌కం ద్వారానూ, ప్ర‌ధాన మంత్రి గ్రామ్ స‌డ‌క్ యోజ‌న ద్వారానూ అనుసంధానం ఏర్ప‌ర‌చాల‌ని పూర్వ ప్రధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచ‌న చేశార‌ని కూడా శ్రీ మోదీ జ్ఞాప‌కం చేసుకున్నారు. వ్య‌వ‌సాయ‌దారుల‌కు స‌రైన సేద్య‌పు నీటి పారుద‌ల‌ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన “ప్ర‌ధాన మంత్రి కృషి సించాయీ యోజ‌న” త‌దిత‌ర అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి కూడా ప్ర‌ధాని ప్ర‌స్తావించారు.

మూడో త‌ర‌గ‌తి, నాలుగో త‌ర‌గ‌తి కేట‌గిరీల‌కు చెందిన ప్ర‌భుత్వ ఉద్యోగుల భ‌ర్తీకి ఇంట‌ర్వ్యూల విధానాన్ని ర‌ద్దు చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వం 2016 జ‌న‌వ‌రి 1న భార‌త దేశ యువ‌తీయువ‌కుల‌కు ఒక విశిష్ట‌మైన కానుక‌ను అందిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

2016లో పార్ల‌మెంట్ ను స‌క్ర‌మంగా ప‌నిచేయ‌నిచ్చి, పేద ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం పాటు ప‌డుతామ‌ని రాజ‌కీయ పార్టీలు ఒక తీర్మానం చేసుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చారు. పార్ల‌మెంట్ లో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి దేశ‌ ప్ర‌జ‌లు త‌మ ప్ర‌తినిధుల‌ను ఎన్నుకొన్నార‌ని, కాబ‌ట్టి ఆ ప‌నిని చేయ‌డమే వారి క‌ర్త‌వ్యం అని ప్ర‌ధాని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఉత్త‌ర ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌‌ర్ శ్రీ రాం నాయ‌క్‌, కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ, కేంద్ర స‌హాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ మ‌హేశ్ శ‌ర్మ‌, కేంద్ర స‌హాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణ‌న్ లు పాల్గొన్నారు.