Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజుఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రజలు నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచనలకీఔత్సాహిక పారిశ్రామిక తత్వానికీ ప్రసిద్ధి చెందారని ప్రధానమంత్రి అన్నారురాష్ట్రానికి ఉన్న వైభవోపేత సంస్కృతినీధైర్య సాహసాలతో పాటు దృఢసంకల్పాన్నీ ఆయన ప్రశంసించారు. ‘వికసిత్ భారత్’ కలను సాకారం చేసే క్రమంలో తెలంగాణ అభివృద్ధి ప్రయాణానికీ తోడ్పాటును అందించాలని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారురాష్ట్ర ప్రజలకు ఆరోగ్యంగా ఉంటూవిజయ పథంలో పురోగమించాలని ఆయన ప్రార్థించారు.  
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం విశిష్ట సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలునూతన ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచనలకీఔత్సాహిక పారిశ్రామిక తత్వానికీ తెలంగాణ ప్రజలు ప్రసిద్ధి చెందారుఈ రాష్ట్రం తన వైభవోపేత సంస్కృతికీచరిత్రకీ మారు పేరువికసిత్ భారత్‌ను ఆవిష్కరించాలనే మన కలను పండించుకోవడంలో భాగంగా తెలంగాణ అభివృద్ధి ప్రయాణానికి తోడ్పాటును అందించడానికీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందిఈ రాష్ట్ర ప్రజలకు మంచి ఆరోగ్యంవిజయం కలగాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***