Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌లకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి; ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కూ ఆయన శుభాకాంక్ష‌లు తెలిపారు


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌లకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ధాన మంత్రి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జానీకానికి కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వారి రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినం నాడు ఇవే నా శుభాకాంక్ష‌లు. ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల యొక్క క‌ల‌లు మ‌రియు ఆకాంక్ష‌లు రానున్న కాలంలో నెర‌వేరు గాక‌.

ఆంధ్ర ప్ర‌దేశ్ కు చెందిన నా సోద‌రులకు మ‌రియు సోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు. ఆ రాష్ట్ర ప్ర‌జ‌లకు చ‌క్క‌ని ఆరోగ్యం మ‌రియు స‌మృద్ధి లభించాల‌ంటూ ఆ ఈశ్వ‌రుడి ని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***