Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని ప్రయోగించిన సందర్భంగా దక్షిణ ఆసియా దేశాల ప్రభుత్వ అధినేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగింపులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని ప్రయోగించిన సందర్భంగా దక్షిణ ఆసియా దేశాల ప్రభుత్వ అధినేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగింపులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు


శ్రేష్ఠులారా,

మీరు పలికిన పలుకులకుగాను మీలో ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను.

మీ ఆలోచనలు ఈ రోజు జరిగిన ఉపగ్రహ ప్రయోగం యొక్క మనోరాగాన్ని ప్రతిధ్వనింపచేస్తున్నాయి.

భావసారూప్య దేశాల మధ్య ప్రాంతీయ సహకారం విషయానికి వస్తే ఆకాశమే హద్దు అనడానికి సైతం వీలు లేదనే సందేశాన్ని దక్షిణ ఆసియా ఉపగ్రహం మనకు అందిస్తోంది.

‘అందరి వికాసం కోసం అందరితోనూ కలిసి’ (“सबका साथ सबका विकास”) అనే నినాదం దక్షిణ ఆసియాలో కార్యాచరణకు మరియు సహకారానికి మార్గాన్ని చూపించే జ్యోతి కాగలుగుతుంది.

ఇంకా, మన ప్రజల ఆర్థిక సమృద్ధి కోసం మనమంతా పాటుపడాలనే ఉమ్మడి ప్రాథమ్యాన్ని సాధించుకొనేందుకు ఇది ఒక సముచితమైన మార్గం కాగలదు కూడాను.

ఈ క్రమంలో, భారతదేశం ఒక బలమైన మరియు కంకణబద్ధురాలైన భాగస్వామి అన్న సంగతిని మీరు గుర్తిస్తారు.

దక్షిణ ఆసియా ఉపగ్రహం ప్రయోగాన్ని ఒక పండుగలా జరుపుకోవడంలో నాతో కలిసివచ్చినందుకుగాను మీకందరికీ మరో మారు ధన్యవాదాలు తెలియజేయనివ్వండి.

అలాగే, ఈ దార్శనికత వాస్తవ రూపాన్ని దాల్చడంలో మీరు సైతం బలమైన మరియు అంతరాయం లేని సాయాన్నందించారు.

ఆఖరుగా, మనమందరం ఇటువంటి వేడుకలను మరిన్నింటిని జరుపుకోవాలని, అటువంటి సందర్భాలలో ప్రాంతీయ వృద్ధి
మరియు సమృద్ధి ల కోసం ఉమ్మడిగా మనం చేసే ప్రయత్నాల యొక్క విజయాన్ని మనమంతా సంతోషంగా ఆస్వాదించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

మీకు ఇవే నా ధన్యవాదాలు. అనేకానేక ధన్యవాదాలు.

***