Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దమన్‌లో నమో ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధానమంత్రి

దమన్‌లో నమో ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధానమంత్రి


నేడు దమమన్‌లో నమో ఆసుపత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో  భాగంగా దీనిని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ ఆసుపత్రి… ఈ కేంద్రపాలిత ప్రాంతం, దీని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల వైద్య అవసరాలను తీర్చడంలో సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించే మా ప్రయత్నాలకు అనుగుణంగా దమన్‌లో నమో ఆసుపత్రిని ప్రారంభించాం. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ ఆసుపత్రి కేంద్రపాలిత ప్రాంతం, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది’’