గుజరాత్‌లోని కెవాడియాకు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి 8 రైళ్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 జనవరి 17 ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు ఐక్యతా ప్రతిమ వద్దకు నిరంతరాయ ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తాయి. ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుజరాత్లో రైల్వే రంగానికి సంబంధించి పలు ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రధానమంత్రి దబోయి- చందోడ్ గేజ్ మార్పిడి చేసిన బ్రాడ్ గేజ్ రైల్వేలైన్ ను, చందోడ్- కేవడియా కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్, కొత్తగా విద్యుదీకరించిన ప్రతాప్‌నగర్-కెవాడియా సెక్షన్ , దభోయి, చందోడ్,కెవడియా కొత్త రైల్వే స్టేషన్ భవనాలను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.ఈ భవనాలను స్థానికత మేళవింపుతో రమణీయమైన డిజైన్లతో రూపొందించారు. వీటిలో ఆధునిక రీతిలో ప్రయాణికుల సదుపాయాలు కల్పించారు దేశంలోగ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కలిగిన తొలి రైల్వేస్టేషన్ కెవాడియా స్టేషన్. ఈ ప్రాజెక్టులు సమీపంలోని గిరిజన ప్రాంతాలలో అభివృద్ధికి అవకాశం కలిగిస్తాయి. ఇవి ఆ ప్రాంతంలోని ప్రధాన మతపరమైన ప్రాంతాలు, నర్మదా నదీతీరంలోని ప్రాచీన యాత్రా స్థలాలను అనుసంధానం చేస్తాయి. ఇవి దేశీయ అంతర్జాతీయ పర్యాటకాన్ని పెంపొందించనున్నాయి. అలాగే మొత్తంగా ఈ ప్రాంత సామాజిక ఆర్ధిక అభివృద్ధికి వ్యాపార అవకాశాలకు ఇది దోహదం చేయనుంది
ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించ నున్న 8 రైళ్ల కు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
|
1 |
20903/04 |
కేవడియా |
వారణాశి |
మహామన ఎక్స్‌ప్రెస్ (వీక్లీ) |
|
2 |
12927/28 |
దాదర్ |
కెవాడియా |
దాదర్-కెవాడియా ఎక్స్‌ప్రెస్ (డెయిలీ) |
|
3 |
20947/48 |
అహ్మదాబాద్ |
కెవాడియ | జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ (డైలీ) |
|
4 |
20945/46 |
కేవడియా |
హజరత్‌నిజాముద్దీన్ |
నిజాముద్దీన్-కేవడియా సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ) |
|
5 |
20905/06 |
కేవడియా |
రేవా |
కేవడియా-రేవా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ) |
|
6 |
20919/20 |
చెన్నై |
కేవడియా |
చెన్నై -కేవడియా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ) |
|
7 |
69201/02 |
ప్రతాప్‌నగర్ |
కేవడియా |
మెము ట్రెయిన్ (డెయిలీ) |
|
8 |
69203/04 |
ప్రతాప్‌నగర్ |
కేవడియా |
మెము ట్రెయిన్ (డెయిలీ) |
క్రమ సంఖ్య |
రైలు నెం. | నుంచి | వరకు | రైలుపేరు / ఫ్రీక్వెన్సీ |
|---|
జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు అత్యధునాతన విస్టా డోమ్ టూరిస్ట్ కోచ్‌ను ఏర్పాటుచేస్తారు. ఇది ఆకాశపు అంచులవరకూ అందాలను తిలకించే అద్భుత అవకాశం కలిగిస్తుంది.
***