నవరాత్రి ఉత్సవాలలో పవిత్ర షష్ఠి రోజున మాత కాత్యాయనిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్చించారు.
దేవీ మాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో అనంత శక్తి, ధైర్య సాహసం, సకారాత్మక సామర్థ్యం సిద్ధించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘నవరాత్రి ఉత్సవాల్లో పవిత్రమైన షష్ఠి రోజు ఈ రోజు.. మాత కాత్యాయని శ్రీచరణాలకు కోటి కోటి ప్రణామాలు. దేవీమాత కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో అనంత శక్తి, సాహసం, సకారాత్మక సామర్థ్యం సిద్ధించాలని అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
नवरात्रि की पवित्र षष्ठी पर मां कात्यायनी के श्रीचरणों में कोटि-कोटि नमन! मेरी कामना है कि उनकी अनुकंपा से हर किसी के जीवन में असीम शक्ति, साहस और सकारात्मक ऊर्जा का संचार हो। https://t.co/7yJ9kB2MQy
— Narendra Modi (@narendramodi) October 16, 2026