Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరాత్రి సందర్భంగా మాతా కాలరాత్రి దేవికి ప్రార్థనలు సమర్పించిన ప్రధానమంత్రి


 

నవరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాతా కాళరాత్రి దేవికి ప్రార్థనలు సమర్పించారు.

 

దేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితం నూతన శక్తి, కొత్త ఆత్మవిశ్వాసంతో ప్రకాశించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. అమ్మవారి దివ్య అనుగ్రహంతో అందరికీ సిరిసంపదలు, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఈ విధంగా పేర్కొన్నారు.

 

“నవరాత్రుల్లో నేడు మాతా కాళరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించే రోజు. ఆమె ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితం నూతన శక్తి, కొత్త ఆత్మవిశ్వాసంతో ప్రకాశించాలి. అమ్మవారి దివ్య అనుగ్రహంతో అందరికీ సిరిసంపదలు కలగాలని ప్రార్థిస్తున్నాను”.