Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నిస్వార్థ సేవ, అంకిత భావం.. ఈ భావనలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


నదులు నిరంతరాయంగా ప్రవహిస్తూ  మన శక్తియుక్తులను మానవాళి సంక్షేమానికి ఎలా ఉపయోగించ గలమో మనకు సూచిస్తున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్వార్థరహిత సేవ, అంకితభావం, పరోపకార భావనలు దేశానికి ఒక కొత్త దిశను చూపుతాయని ఆయన అన్నారు.
‘‘జీవనం స్వం పరార్థాయ నిత్యం యచ్ఛత మానవాః, ఇతి సందేశమాఖ్యాతుం సముద్రం యాన్తి నిమ్నగాః’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
పరులకు సేవ చేయడానికి, వారి సంక్షేమం కోసం పాటుపడటానికి మనుషులు తమ జీవితాలను అంకితం చేస్తారు. నదులు ప్రవాహంగా వెళ్లి మహాసముద్రంలో కలవడాని కన్న ముందు తమ జలాలను నిరంతరాయంగా, నిస్వార్థంగా అందిస్తూ ఎంతో మంది జీవితాలను పోషిస్తున్నట్లుగానే మనం మన కాలాన్ని, శక్తియుక్తుల్ని, వనరులని ఇతరుల శ్రేయస్సుకు అంకితం చేయాలి. స్వార్థరహిత సేవ, కరుణ, అందరి మేలు కోరి పనిచేయడంలోనే మానవ జీవిత లక్ష్యం,  పరమార్థం ఇమిడిపోయి ఉన్నాయని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘మానవ జాతి సంక్షేమానికి మనం మన సామర్థ్యాన్ని ఏవిధంగా ఉపయోగించవచ్చో నదీజలాల నిరంతర ప్రవాహం మనకు చాటిచెబుతోంది. నిస్వార్థ సేవ, అంకితభావం, పరోపకారం.. ఈ భావనలు దేశానికి ఒక కొత్త దిశను చూపుతాయి.
జీవనం స్వం పరార్థాయ నిత్యం యచ్ఛత మానవాః,
ఇతి సందేశమాఖ్యాతుం సముద్రం యాన్తి నిమ్నగాః’’ అని పేర్కొన్నారు.