Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నీటి నిర్వహణ, ప్రజా భాగస్వామ్యంపై వ్యాసం ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


కేంద్ర మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
తాగునీరు, స్వచ్ఛత, నదుల సంరక్షణ, సేద్య సామర్థ్యం, నీటిమట్టం తగ్గిన భూగర్భ జలాలు తిరిగి పుంజుకొనేటట్లు చూడడం, వ్యర్థ జలాలను మళ్లీ ఉపయోగించడంతో ముడిపడిన సవాళ్లను ప్రభుత్వ కార్యక్రమాలు సమగ్ర, పరస్పర అనుసంధానిత దృష్టికోణంతో ఎలా పరిష్కరించిందీ ఈ వ్యాసంలో తెలిపారు. ఉమ్మడి జాతీయ దార్శనికతను సాకారం చేయడంలో బాధ్యత గల పాలన, ప్రజల చురుకైన భాగస్వామ్యం ఊతాన్ని అందిస్తూ ఉండగా గత పది సంవత్సరాల్లో సాధించిన విజయాలను కూడా ఈ వ్యాసంలో వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘
తాగునీరు, స్వచ్ఛత, నదుల సంరక్షణ, సేద్య సామర్థ్యం, మట్టం తగ్గిన భూగర్భ జలాలు తిరిగి పుంజుకొనేటట్లు చూడడం, వ్యర్థ జలాలను మళ్లీ ఉపయోగించడంతో ముడిపడిన సవాళ్లను ప్రభుత్వ కార్యక్రమాలు సమగ్ర, పరస్పర అనుసంధానిత దృష్టికోణంతో ఎలా పరిష్కరించిందీ కేంద్ర మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్ ఈ వ్యాసంలో తెలిపారు.
ఉమ్మడి జాతీయ దార్శనికతను సాకారం చేయడంలో బాధ్యత గల పాలన, ప్రజల చురుకైన భాగస్వామ్యం ఊతాన్ని అందించగా గత పది సంవత్సరాల్లో సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు’’ అని పేర్కొంది.

***