పిఎంఇండియా
స్వాతంత్య్ర సమర వీరుల ను స్మరించుకొంటూ వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ని ఘటించారు; సుభాష్ చంద్ర బోస్ 122 వ జయంతి కి గుర్తు గా, ఆయన పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియమ్ ను ఎర్ర కోట లో ప్రధాన మంత్రి నేడు ప్రారంభించారు.
మ్యూజియమ్ ఆన్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఎండ్ ఇండియన్ నేశనల్ ఆర్మీ (ఐఎన్ఎ) ని ప్రధాన మంత్రి సందర్శించారు. ‘నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి నాడు ఆయన కు నేను ప్రణమిల్లుతున్నాను. భారతదేశం స్వతంత్ర దేశం గా అవతరించాలని, దేశ పౌరులు గౌరవ ప్రదమైనటువంటి జీవితాన్ని గడిపేటట్లు చేయాలని కట్టుబడ్డ ప్రముఖుడు ఆయన. ఆయన ఆదర్శాల ను కార్యరూపం లోకి తీసుకు వచ్చేందుకు మరియు ఒక దృఢమైన భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు మేం కంకణం కట్టుకున్నాం’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ గోడల లో నుండి చరిత్ర మారు మ్రోగుతోంది అని కూడా ఆయన అన్నారు. భారతదేశ సాహసిక పుత్రులైన కర్నల్ ప్రేమ్ సహగల్, కర్నల్ గుర్‌బక్ష్ సింహ్ ధిల్లాన్ మరియు మేజర్ జనరల్ శాహ్ నవాజ్ ఖాన్ ల పై వలస పాలకులు ఇదే భవనం లో విచారణ ను జరిపారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు మరియు ఇండియన్ నేశనల్ ఆర్మీ చరిత్ర కు దర్పణం పట్టుకొన్నాయా అన్నట్లున్న ఛాయాచిత్రాల ను ప్రధాన మంత్రి తిలకించారు. నేతాజీ తోను, ఐఎన్ఎ తోను అనుబంధమున్న కొన్ని వస్తువుల ను ఆయన చూశారు. వాటి లో నేతాజీ ఉపయోగించిన ఒక చెక్క కుర్చీ తో పాటు ఒక కత్తి, ఇంకా ఐఎన్ఎ కు చెందిన పతకాలు, బాడ్జి లు మరియు యూనిఫారాలు ఉన్నాయి.
జలియాన్ వాలా బాగ్ సామూహిక హత్య ఘటన ను గురించి వివరించే ఛాయాచిత్రాలు, చిత్రలేఖనాలు, ఇంకా వార్తా పత్రిక ల కథనాల కత్తిరింపులు.. వీటన్నింటినీ యాద్-ఎ-జలియాన్ మ్యూజియం లో ప్రధాన మంత్రి వీక్షించారు. 1919వ సంవత్సరం లో జరిగిన జలియాన్ వాలా బాగ్ సామూహిక హత్య ఘటన తాలూకు చరిత్ర ను మరియు ఒకటో ప్రపంచ యుద్ధం కాలం లో భారతీయ జవానులు చేసిన త్యాగాల ను ఈ మ్యూజియమ్ సందర్శకుల కు చాటిచెప్తుంది.
ప్రధాన మంత్రి ‘మ్యూజియమ్ ఆన్ 1857- ఇండియా స్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ను కూడా సందర్శించారు. 1857వ సంవత్సరం లో జరిగిన స్వాతంత్య్ర సమరం తాలూకు చారిత్రక చిత్రణ ను ఆయన చూశారు. ఆ కాలం లో భారతీయులు ప్రదర్శించిన పరాక్రమాన్ని మరియు వారు చేసిన త్యాగాల ను ఈ మ్యూజియంలు కళ్ళ కు కడుతున్నాయి. ఈ మ్యూజియమ్ లు మన స్వాతంత్య్ర యోధుల త్యాగాల కు సైతం అద్దం పడుతున్నాయి.
అదే ప్రాంగణం లో ఏర్పాటైన భారతీయ కళా ప్రదర్శన ను కూడా ప్రధాన మంత్రి పరిశీలించారు. ‘కొలువుదీరిన గురుదేవులు టాగోర్ యొక్క కృతుల ను దృశ్య కళ లో వీక్షించటం కళా ప్రేమికుల కు ఒక విందు. గురుదేవులు శ్రీ ఠాగూర్ ఒక చేయి తిరిగిన రచయిత అనేది మనకు అందరికీ తెలుసు. అయితే ఆయన కళా జగత్తు తో కూడా ఒక బలమైన బంధాన్ని కలిగివుండే వారు. పలు ఇతివృత్తాల తో కూడిన కృతుల ను ఎన్నింటినో ఆయన వెలువరించారు. గురుదేవుల కృతులు అంతర్జాతీయం గానూ ప్రదర్శితమయ్యాయి’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘భారతీయ కళ మరియు సంస్కృతుల లోని అత్యుత్తమ అంశాల ను దర్శింపచేసే దృశ్య కళ ను చూడాలని కళా ప్రేమికులందరికీ ప్రత్యేకం గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజా రవివర్మ, గురుదేవులు టాగోర్, అమృత శేర్ గిల్, అవనీంద్రనాథ్ టాగోర్, నంద్‌లాల్ బోస్, గగనేంద్రనాథ్ టాగోర్, సైలోజ్ ముఖర్జీ మరియు జామినీ రాయ్ తదితర ప్రసిద్ధ భారతీయ కళాకారుల కృతులు ఈ ప్రదర్శన లో ఉన్నాయి’ అని ఆయన తన మనోభావాల ను ట్విటర్ లో వ్యక్తం చేశారు.
ఈ మ్యూజియమ్ లను ప్రధాన మంత్రి ప్రారంభిస్తూ, ‘భారతదేశం యొక్క సుసంపన్న సంస్కృతి మరియు చరిత్ర లకు సంబంధించిన నాలుగు మ్యూజియమ్ లను ప్రారంభించడం నన్ను అత్యంత వినమ్రత తో కూడిన కార్యం. ఈ నాలుగు మ్యూజియమ్ లకు ‘క్రాంతి మందిర్’ అనే పేరు ను పెట్టడమైంది. ఈ భవన సముదాయం లో.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు ఇండియన్ నేశనల్ ఆర్మీ ల పై మ్యూజియమ్ లు, జలియన్ వాలా బాగ్ మరియు ఒకటో ప్రపంచ యుద్ధం ఇతివృత్తాలు గా ఏర్పాటు చేసినటువంటి యాద్- ఎ-జలియాన్ మ్యూజియమ్, ‘మ్యూజియమ్ ఆన్ 1857- ఇండియా స్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’తో పాటు ‘దృశ్యకళా మ్యూజియమ్ ఆన్ ఇండియన్ ఆర్ట్’.. భాగం గా ఉన్నాయి. ఇది మూడు శతాబ్దాల తరబడి కాలానికి చెందిన 450 కు పైగా కళాకృతుల కు నిలయం గా ఉంది.
మన మహనీయ స్వాతంత్య్ర యోధుల విప్లవాత్మక ఉత్సాహానికి మరియు సాహసానికి ఒక శ్రద్ధాంజలి వంటిది ‘క్రాంతి మందిర్’. ఈ వస్తు ప్రదర్శన శాల లు గణతంత్ర దినోత్సవాని కన్నా ముందే మన యువజనుల ను మన దేశం యొక్క గౌరవశాలి ఇతిహాసం తో జోడించడంతో పాటు పౌరుల లో దేశ భక్తి భావాలను నింపివేస్తాయి.