Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ పూర్వ ప్ర‌ధాని శ్రీ సుశీల్ కొయిరాలా మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి సంతాపం


నేపాల్ పూర్వ ప్ర‌ధాని శ్రీ సుశీల్ కొయిరాలా మ‌ర‌ణం ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు.

“శ్రీ సుశీల్ కొయిరాలా మృతితో, నేపాల్ కు ద‌శాబ్దాల త‌ర‌బ‌డి సేవ‌లు అందించిన ఒక పెద్ద నేత‌ను ఎన్ సి కోల్పోయింది.

భార‌త‌దేశం కూడా ఓ విలువైన మిత్రుడిని కోల్పోయింది. ఆయ‌న మ‌ర‌ణం నాకు వేద‌న‌ను క‌లిగించింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి ల‌భించు గాక‌.

సుశీల్ కొయిరాలా గారి నిరాడంబ‌ర‌త్వం నుంచి మ‌నం అంద‌ర‌మూ పాఠాలు నేర్చుకోవ‌ల‌సి ఉంది. ఈ దుఃఖ ఘ‌డియ‌ల‌ను నేపాల్ ప్ర‌జ‌లు,, కొయిరాలా కుటుంబంతో పాటు నేనూ పంచుకుంటున్నాను” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***